రాహుల్ యాత్రకు విశేష స్పందన
భోపాల్,నవంబర్26 (ఆంధ్రపత్రిక): రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో ఉత్సాహంగా కొనసాగుతోంది. అక్కడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తుల పెద్ద ఎత్తున రాహుల్ వెన్నంటి నడుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో బజిఎపిఎలా అధికారాన్ని హస్తగతం చేసుకుందో..కమలనాధ్ ప్రభుత్వాన్ని ఎలా కూల్చిందో రాహుల్ తనయాత్రలో వివరిస్తున్నారు. శనివారం మోర్తక్క గ్రామం నుంచి 80వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాతో కలసి పాదయాత్ర పాల్గొన్నారు. గత మూడు రోజులుగా సోదరి ప్రియాంక, ఇతర కుటుంబ సభ్యులతో కలసి రాహుల్ చేస్తున్న యాత్రలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. సీనియర్ నేతలంతా తరలివచ్చి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొని ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై ఆధిపత్యాన్ని చాటుకునేలా రాహుల్ పాదయాత్రలో హడావుడి చేస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్‌ఖ్తెంది. గత నాలుగు రోజులుగా మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న పాదయాత్ర డిసెంబర్ 4న రాజస్థాన్‌లో ప్రవేశించనుంది.