ఎగువ నుండి చేరుతోన్న వరద నీటి ఉధృతికి శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం సోమవారం ఉదయం 9 గంటలకు 884.90 అడుగులకు చేరిందని, నీటినిల్వ 215.3263 టీఎంసీలుగా నమోదైందని అధికారులు తెలిపారు. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 2,35,086 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి పోటెత్తింది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లను 12 అడుగుల మేర పైకెత్తి 3,19,830 క్యూసెక్కుల నీటిని స్పిల్ వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయం నుంచి 62,529 అదనపు క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి సాగర్‌కు 3.14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను ఎత్తి 2.27 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులుగా ఉన్నది. జలాశయం గనిష్ట నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ఇప్పుడు 308.35 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. సాగర్ కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాన జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!