గత కొన్నిరోజులుగా తిరువూరు నియోజకవర్గంలో వినగడప-కట్టలేరు బ్రిడ్జి నిర్మాణంపై టీడీపీ,వైసీపీ మద్య విమర్శలు కోనసాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే రెండురోజుల క్రితం తిరువురులో మాజీ మంత్రి దేవినినేని ఉమా పర్యటించారు.
గత కొన్నిరోజులుగా తిరువూరు నియోజకవర్గంలో వినగడప-కట్టలేరు బ్రిడ్జి నిర్మాణంపై టీడీపీ,వైసీపీ మద్య విమర్శలు కోనసాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే రెండురోజుల క్రితం తిరువురులో మాజీ మంత్రి దేవినినేని ఉమా పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన వినగడప-కట్టలేరు బ్రిడ్జి నిర్మాణంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇంకా బ్రిడ్జి నిర్మాణం చెపట్టలేకపోయిందని ఆరోపించారు.ఈ సందర్భంగా దేవినేని ఉమా వ్యాఖ్యలకు వైసీపీ నేత, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి స్పందించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరదలకు ఈ వంతెన కొట్టుకుపోయిందని ఆరోపించారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమా వంతెన నిర్మించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బస్సు యాత్ర పేరుతో టీడీపీ నేతలు సెల్ఫీలు దిగారంటూ దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే వినగడప-కట్టలేరు వంతెన నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు.