హైదరాబాద్/విజయవాడ,అక్టోబర్ 26 (ఆంధ్రపత్రిక): కార్టీకమాసం ప్రారంభంతో పాటు, గ్రహణశూల కూడా కావడంతో ప్రజలు నదీతీరాలు,సముద్ర తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఎక్కడిక్కడ ఆలయాల్లో ప్రత్యేక పూజ ల్లో పాల్గొన్నారు. కార్తీకమాసం శివకేశవ ప్రీతికరం అందుకే పవిత్రమైన మాసంగా భావిస్తారు. కార్తీక మాసం దైవ సంబంధికమైన వ్రతాలకు, నోములకు, ఉపవాసాలకు, శుభ కార్యాలకు ఎంతో ముఖ్యమైనది. ఈ నెల 26 నుంచి నవంబరు 23 వరకు కార్తీక పూజలు జరుపుకోనున్నారు. కృష్ణాతీరంతో పాటు పంచారామాల్లొ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో వత్తులు వెలగించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజ లు, కార్తీక పురాణ ప్రవచనాలు నిర్వహించనున్నారు. కార్తీకమాసం ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. దీంతో తెలుగు రాష్టాల్ల్రో కార్తీకశోభతో ఆలయాలు కిటకిటలాడాయి. సముద్రస్నానాలు, నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాలు భక్తులతో అలరారాయి. కార్తీకమాసంలో ఉపవాసం చేసిన పుణ్యం లభిస్తుందని పండితులు పేర్కొన్నారు. సృష్టికి లయకారుడైన పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసం ఎన్నో విశిష్టతల వేదిక. ఉపవాసం చేయలేని.. వారు ఈ ఒక్క రోజు ఆచరిస్తే చాలన్న సూచనతో ఉపవాస దీక్షలకు ప్రాధాన్యం పెరిగింది. పలువురు ఉదయాన్నే పుణ్యస్నానాలు చేసి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. ప్రముఖ శైవక్షేత్రాలతో పాటు నదీ తీర ప్రాంతాల్లో ఉన్న శివాల యాల్లో రద్దీ నెలకొంది. ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తిలతో పాటు పంచారామ క్షేత్రాలైన అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుంచే నదీజలాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. రాజమండ్రి వద్ద గోదావరి స్నానాలతో గోదావరి పులకరించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ, కీసర, కాళేశ్వర, జోగులాంబ, వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రామప్ప తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు చేరుకుని శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. శివనామస్మరణలతో ఆలయాలు మార్మోగిపోతున్నాయి. భద్రా చలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రామాలయంలో దర్శనం చేసుకున్నారు. బాసర,ధర్మపురి ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు. ఆలయాల్లో కార్తీక పూజలు చేశారు. యాదగిరిగుట్టలో సత్యనారాయణ స్వామి వ్రతాలు విరివిగా చేపట్టారు. ఈ సారి నవంబరు 8న కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉండడంతో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయాలు మూసివేయనున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!