*దళితుల సొమ్ము మింగేసిన అధికారులు.*
మచిలీపట్నం : *చెప్పులు కుట్టుకునే వ్యక్తిని నాలుగు సంవత్సరాలుగా చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్న అధికారులు. సంవత్సరాలు గడుస్తున్నా కనికరం లేదని ఆవేదన చెందుతున్న బాధితుడు.*
వివరాలు పరిశీలిస్తే మచిలీపట్నం బలరాముని పేట కు చెందిన గూడవల్లి ఏసు కుమారి 18 సంవత్సరాల పాటు మచిలీపట్నం మునిసిపాలిటీ లో పారిశుధ్య కార్మికురాలి గా పనిచేసి నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందినది.*
ఏసు కుమారి భర్త గూడవల్లి నాంచారయ్య స్థానిక నాయర్ బడ్డీ సెంటర్ లో చెప్పులు కట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయిన బార్య ప్రావిడెంట్ ఫండ్ డబ్బుల కోసం నాలుగు సంవత్సరాల నుండి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరం చూపడం లేదని ఆవేదన చెందాడు.*నాలుగు సంవత్సరాలు తిప్పుకుని ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవని చెప్పుచున్నారు అధికారులు, కాయకష్టం చేసుకుని బ్రతుకును ఈడుస్తున్న పేద జీవుల డబ్బులు కూడా మింగేస్తున్నారు అని బోరున విలపిస్తున్నాడు.*