Underwater Metro : దేశంలోనే తొలిసారిగా, కోల్‌కతా మెట్రో (Kolkata Metro Rail)… బుధవారం నాడు హుగ్లీ నది (Hooghly Rive)లో సొరంగం ద్వారా… మొదటిసారి నీటి అడుగున ప్రయాణాన్ని ప్రారంభించి చరిత్ర సృష్టించింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని మెట్రో రైల్వే చైర్మన్ పి.ఉదయకుమార్ రెడ్డి అన్నారు. ఆయన స్వయంగా… ర్యాక్ నంబర్ MR-612లో మహాకరణ్ నుంచి హౌరా మైదాన్ స్టేషన్‌కు రైలులో ప్రయాణించారు.కోల్‌కతా మెట్రో రైలు.. బుధవారం ఉదయం 11:55కి హుగ్లీ నదిలో ప్రయాణించింది. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు నీటి అడుగున సొరంగంలో.. రైలు ప్రయాణం వచ్చే ఏడు నెలల పాటూ… ట్రయల్ రన్‌లో జరుగుతుంది. ఆ తర్వాత ఈ మార్గంలో సాధారణ సేవలు ప్రారంభమవుతాయిఈ మెట్రో మార్గంలో భూగర్భ మార్గం 4.8 కిలోమీటర్లు ఉంది. ఇది ఉపరితలం నుంచి 33 మీటర్ల (108 అడుగుల లోతు) దిగువకు ఉంటుంది. భారతదేశపు లోతైన మెట్రోస్టేషన్ ఇదే. మెట్రో రైలు.. 45 సెకన్లలో హుగ్లీ నదిని దాటుతుంది. నదిలో 520 మీటర్ల విస్తీర్ణంలో సొరంగం ఉంది. నీటి మట్టానికి 32 మీటర్ల దిగువన ఈ సొరంగం ఉందిఈ విభాగంలో వాణిజ్య సేవలు ఈ సంవత్సరం ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్వే (KMRCL) చైర్మన్ పి.ఉదయ కుమార్ రెడ్డి, ఎండీ హెచ్.ఎన్. జైస్వాల్‌తోపాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రైలు వచ్చిన తర్వాత రెడ్డి హౌరా స్టేషన్‌లో ప్రార్థనలు చేశారు. (పూజల తర్వాత MR-613ను హౌరా మైదాన్ స్టేషన్‌కు తరలించారు. KMRCL ఉద్యోగులు, ఇంజనీర్లు, అందరి కృషి, పర్యవేక్షణలో ఈ ఇంజనీరింగ్ అద్భుతం సాధ్యమైంది. ఇది కార్యరూపం దాల్చడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారుమెట్రో రైల్వే CPRO కౌశిక్ మిత్రా మాట్లాడుతూ… “అనేక అడ్డంకులను అధిగమించి, మేము హుగ్లీ నది కింద రైలును నడపగలిగాము. ఇది మెట్రో రైల్వేకు చరిత్రాత్మక క్షణం” అన్నారు.కోల్‌కతా శివారు ప్రాంతాల ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థను అందించడానికి ఇది విప్లవాత్మకమైన చర్య అని కౌశిక్ మిత్రా తెలిపారు. ఇది నిజంగానే బెంగాల్ ప్రజలకు అందించిన ప్రత్యేక నూతన సంవత్సర కానుక అనుకోవచ్చని అన్నారు. (
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!