(06 ఫిబ్రవరి ‘అంతర్జాతీయ స్ర్రీ జననేంద్రియ అవయవ వైకల్య వ్యతిరేక దినం’ సందర్భంగా)
స్త్రీల జననేంద్రియ అవయవాలను, ముఖ్యంగా స్త్రీ జననేంద్రియ ప్రదేశంలోని క్లిటారిస్(స్త్రీగుహ్యాంకురం)
ప్రపంచవ్యాప్త మూడాచార సమస్య:
మతాచార నెపంతో అభాగ్య బాలికల్లో తీవ్ర నొప్పి, అతి రక్తస్రావం, జ్వరం, భయం, జననేంద్రియ కణజాల వాపు, టెటనస్ లాంటి అంటువ్యాధులు, పుండ్లు ఏర్పడడం, షాక్‌లు మాత్రమే కాకుండా మరణం కూడా సంభవించవచ్చు. యఫ్జీయంతో దీర్ఘకాలికంగా యోని సమస్యలు, రుతుస్రావ ఇబ్బందులు, లైంగిక సమస్యలు, మానసిక సమస్యలు, ప్రసవ సమయంలో అధిక శిశు మరణాలు, మూత్రపిండ సమస్యలు కూడా ఎదురవుతాయి. నేటి ఆధునిక సమాజంలో మత విశ్వాలు ముదిరి రుతుస్రావ మహిళను ‘అపరిశుభ్ర’ శరీరంగా కూడా భావించడం అమానవీయమే కాదు ఆక్షేపణీయం కూడా. 6 – 7 ఏండ్ల బాలికలను బాధించే యఫ్జియం ఆచారాన్ని నిషేధించాలనే, అది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని, పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా సుప్రీమ్ కోర్టుకు చేరింది. ఇలాంటి అనాగరిక, మొరటు, క్రూరమైన బాలికల ఆరోగ్య సమస్యను సత్వరమే నిషేధించాలని శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యావంతులు, పౌర సమాజం కోరుకుంటున్నది. ఇలాంటి భయానక నేరపూరిత సాంప్రదాయం చిన్నారులను భయకంపితం చేయడమే కాకుండా ఎదిగిన కొద్ది అనారోగ్య కారణాలకు దారి తీస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
సాంప్రదాయవాదులు, మూఢ విశ్వాసాలను గుడ్డిగా నమ్మే సమాజాలలో ఈ దురాచారాన్ని నిషేధించుట కొంత కష్టమే. కాని సుదీర్ఘ అవగాహనతో స్త్రీ జననేంద్రియ కట్టింగ్ బాధల నుండి బాలికలను రక్షించే ప్రయత్నాలలో భాగంగా తల్లితండ్రులును చైతన్యవంతులుగా చేయవచ్చు. యఫ్జియం నిషేధ చట్టం చేయడం, దానిని గట్టిగా అమలు పరచడం జరగాలి. ప్రభుత్వాల నిరంకుశ సాంప్రదాయాలు యఫ్జియంని అమలు చేసే ప్రయత్నాలు చేస్తాయి. ఇలాంటి ఛాందస భావాలు ఉన్న దేశాల్లో నిషేధించడం వీలు కాకపోయినా, సభ్యసమాజం పెద్ద సవాళుగానే తీసుకొని తగ్గించే కృషి నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది. యఫ్జియం పట్ల శూన్య సహనంతో నిషేధించడానికి, ఈ దురాచారం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి 2018లో ప్రజ్ఞేష్ సింగ్ దర్శక నిర్మాతగా 40 నిమిషాల నిడివిగల లఘు చిత్రం ‘షినాక్థ్’ కూడా తీయడం జరిగింది. మహిళల ఆరోగ్యం, భద్రత, శరీరక సమగ్రత, హింస నుండి స్వేచ్ఛ, అమానవీయ పద్దతి, స్వేచ్ఛ హక్కును హరించడం, మైనర్ బాలికలను ఇలాంటి శిక్షల నుండి రక్షించడం, లింగ సమానత్వం, మహిళా విద్య, ఆర్థిక స్వేచ్ఛ, యఫ్జియం దుష్పరిణామాల అనగాహన, సమ న్యాయం లాంటి చర్యలను ఐరాసలో పాటు ప్రభుత్వాలు కూడా సత్వరమే తీసుకొని యఫ్జియం దురాచారాన్ని నిర్మూలించే ప్రయత్నాలు గట్టిగా చేయాలి. స్త్రీ సున్తీ లేని సమాజాన్ని స్థాపించడంలో శూన్య సహనాన్ని (జీరో టాలరెన్స్) ప్రదర్శిద్దాం. బాలికలను స్వేచ్ఛగా ఎదగనిద్దాం. మూఢవిశ్వాసాలకు మంగళం పాడదాం.