హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాను చంపేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. శుక్రవారం జరిగిన దాడుల్లో నస్రల్లాతో పాటు మరికొందరు హిజ్బుల్లా కమాండర్లు మరణించారని ఇజ్రాయెల్ బలగాలు తెలిపాయి.దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జీ హలేవి ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ” మా మెసేజ్ స్పష్టంగా ఉంది. ఇజ్రాయెల్ పౌరుల్ని ఎవరైనా బెదిరిస్తే వాళ్లు ఉత్తరాన ఉన్నా, దక్షిణాన ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా వాళ్లను ఎలా పట్టుకోవాలో మాకు తెలుసు” అని అందులో చెప్పారు.
ఈ వీడియో క్లిప్‌ను ఆయన ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు.
హిజ్బుల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ మీద తమ ఫైటర్ జెట్లు లక్షిత దాడి (టార్గెటెడ్ అటాక్) నిర్వహించాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బేరూత్‌లోని దహియే ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ ఉన్న ఒక నివాస భవనంపై తాము దాడి చేసినట్లు తెలిపింది.
దాడి జరిగినప్పుడు హిజ్బుల్లా సీనియర్ కమాండ్ నాయకులంతా అక్కడే ఉన్నారని, ఇది వారికి బాగా పట్టున్న ప్రాంతమని ఐడీఎఫ్ వెల్లడించింది.