విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రపత్రిక): విశాఖ నగరం క్రీడలకు ఎంతో అనుకూలమైనదని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. గురువారం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో నిజీ సూట్ ఖాన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ (సీఎం కప్పు) కరాటి పోటీలను నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, సినీ హీరో డాక్టర్ సుమన్ జ్యోతి ప్రజ్ఞాలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా శరీర ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని, మన విశాఖ నగరం నుండి ఎంతోమంది క్రీడాకారులు వివిధ క్రీడల్లో రాణించి దేశ విదేశాలలో ఉద్యోగాలు సంపాదించి క్రీడల్లో పాల్గొంటున్నారని , ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖ నగరం క్రీడలకు ఎంతో అనువైన ప్రాంతమని ఇక్కడ కోచ్ లు ఎంతో దృఢనిక్షంతో క్రీడల్లో శిక్షణ ఇవ్వడం సంతోషమని నేడు సీ ఎం కప్పు పేరుతో కరాటే పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషం ఇస్తుందన్నారు. ఈ పోటీలు ఈనెల 9 నుండి 12వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కరాటి పోటీలో దేశ విదేశాల నుండి సుమారు 870 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని, ప్రతి పాఠశాలలో క్రీడల కొరకు ఒక ఉపాధ్యాయుని నియమించి ఆటల కొరకు సమయం కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణీతగా ఎస్పిఎండి నాయుడు, డి గోవింద యాదవ్, కే సుమన్, అనకాపల్లి డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్, బెన్నీ కుమార్, ఎన్ వి రమణ తదితరులు పాల్గొన్నారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!