ఈ యాక్షన్ డ్రామాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. శివకార్తికేయన్, త్రిష అదితి పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఫస్ట్ డే ఓపెనింగ్ అదిరిపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం డ్రాప్ అయ్యింది. ది గోట్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. కొంతకాలంగా స్ట్రీమింగ్ డేట్ పై ఫుల్ బజ్ నడుస్తుండగా..ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ గత అర్దరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో మొత్తం ఐదు భాషలలో విడుదలైన ఈ ఇప్పుడు ఓటీటీలోకి కూడా అన్ని భాషలలో ఒకసారి వచ్చేసింది. థియేటర్లతో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రన్ టైమ్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లో విజయ్ దళపతి డ్యూయల్ రోల్ చేశారు. యంగ్ క్యారెక్టర్ కోసం డీఏజింగ్ టెక్నాలజీని డైరెక్టర్ వెంకట్ వినియోగించారు. అయితే దీనిపై మిక్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవ, మోహన్, జయరాం, అజ్మల్ అమీర్, వైభవ్, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో హీరోయిన్ త్రిష స్పెషల్ సాంగ్ చేసింది.
ది గోట్ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాయనర్ పై నిర్మించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. భారీ హైప్ మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లు రాబట్టగా.. రూ125 కోట్లతో నెట్ ఫ్లిక్స్ డీల్ చేసుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.