బిఆర్‌ఎస్ సత్తా చాటేలా జనసవిూకరణ
పరేడ్ గ్రౌండ్స్ సభ కోసం పెద్ద ఎత్తున కసరత్తు
హైదరాబాద్,ఫిబ్రవరి10(ఆంధ్రపత్రిక) : ఈ ఏడాదంతా ఇక ఎన్నికల కాలమే. బిఆర్‌ఎస్‌గా మారిన టిఆర్‌ఎస్
సభల ద్వారా సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటికే ఖమ్మం, నాందేడ్ సభల ద్వరా జనబలిమి చూపిన బిఆర్‌ఎస్ ఇక ఇదే విధానంతో ముందుకు పోవాలని చూస్తోంది. వివిధ రాష్టాల్ల్రోనూ సభల ద్వారా సత్తా చాటేలా ప్రయత్నాలు చేస్తోంది. వివిధ రాష్టాల్ర నేతలను ఆహ్వానించి వారి ముందు బలప్రదర్శనకు
సిద్దం అవుతోంది. ఖమ్మంలో ఇదే ప్రయత్నం చేశారు. నాందేడ్‌లోనూ ఇలాగే వ్యవహరించారు. ఈ క్రమంలో ఈ నెల 17న సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మరో మారు సత్తా చాటబోతున్నది. దీనికోసం భారీగా జనసవిూకరణ చేయబోతున్నారు. భారత రాష్ట్రసమితి ఆవిర్భావం తర్వాత.. ఇప్పటి వరకు రెండుసార్లు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఒకటి ఖమ్మం లోను.. రెండోది మహారాష్ట్ర`తెలంగాణ సరిహద్దులో ఉన్న నాందేడ్‌లోనూ ఈ సభలను భారీ ఎత్తున నిర్వహించి..బీఆర్‌ఎస్ సత్తా చాటే ప్రయత్నం చేసింది. ఇక ఇప్పుడు మూడో సభకు రంగం సిద్దం అయింది. దీనిని ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని అధికార పార్టీ నిర్ణయించింది.
ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కెటిఆర్ సవిూక్షించి జనసవిూకరణపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇక బీఆర్‌ఎస్ నిర్వహించనున్న మూడో సభ బాధ్యతలను.. మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. తొలి సభ బాధ్యతలను సీఎం కేసీఆర్ మేనల్లుడు మరోమంత్రి హరీష్ రావు తీసుకుని ఘన విజయం చేశారు. ఈ సభ విజయంతో హరీష్ రావును సిఎం కెసిఆర్ అభినందించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో నిర్వహించే సభ బాధ్యతలను మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. దీంతో ఆయన ఇప్పటి నుంచే జన సవిూకరణపై దృష్టి పెట్టారు. కేవలం మరో వారం రోజుల సమయం ఉండడంతో నగర నేతలపై ప్రధానంగా బాధ్యతలను అప్పగించారు. అదే రోజున.. రాష్ట్ర నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం.. బీఆర్‌ఎస్ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు స్టాలిన్ హేమంత్ సొరేన్ బిహార్ ఉప ముఖ్య మంత్రి తేజస్వి యాదవ్ తదితర నేతలు కూడా హాజరు కానున్నారు. వీరికి ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపారు.
ఈ సభకు భారీ ఎత్తున జన సవిూకరణ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ సవిూపంలోని జిల్లాల్లలో ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10వేల మందికి తగ్గకుండా హాజరయ్యేలా చూడాలని నేతలకు కేటీఆర్ సూచించారు. నగరానికి సంబంధించి మంత్రులు తలసాని ఎనివాసయాదవ్, మల్లారెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు జనసవిూకరణలో కీలక భూమిక పోషించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన.. సీనియర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇన్ఛార్జిలుగా నియమించనున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందున.. అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం ప్రారంభోత్సవం పరేడ్ గ్రౌండ్ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలనేది కేటీఆర్ ఆదేశం. అంబేడ్కర్ పేరు పెట్టిన సచివాలయాన్ని కూడా ప్రధానంగా ప్రచారం చేయబోతున్నారు. ఎఐఎం ఇప్పటికే సచివాలయ నిర్మాణంపై ప్రశంసలు కురిపించింది. తాజ్‌మహల్ లాగా అందంగా తీర్చి దిద్దారని ఎంఐఎం అధినేత ఓవైసీ ప్రస్తుతించారు. ఎన్నికల ఏడాది కావడంతో ఇక కెసిఆర్ ఏ కార్యక్రమాన్ని అయినా భారీగానే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే కర్నాటక తదితర రాష్టాల్ల్రో ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో కర్నాటకలోనూ ఓ సభ పెట్టే అవకాశాలు ఉన్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!