కాకినాడ జీజీహెచ్లో ఒక పడకపై ఇద్దరేసి రోగులు ఉండగా.. నేలపై పడుకున్న వృద్ధుడు
వాతావరణంలో మార్పులతో జ్వరాలు ప్రబలుతున్నాయి. డబ్బులున్న మారాజులు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తుంటే..
పేదలు ప్రభుత్వాసుపత్రులకే పరుగులు తీస్తున్నారు. 1,155 పడకలున్న కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 2వేల మందికి పైగా వచ్చి చేరారు. దాంతో కొన్ని వార్డుల్లో ఒక్కో మంచం మీద ఇద్దరిని పడుకోబెట్టగా, చివరకు నేలమీద కూడా పడుకోబెట్టి చికిత్స చేయాల్సి వస్తోంది. జ్వరాలతో ఎక్కువ కేసులు రావడమే ఈ దుస్థితికి కారణమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి చెప్పారు.