సంక్రాంతి సీజన్ తర్వాత ఇప్పటి వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించలేదు. గత వారం వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అమిగోస్ తో కళ్యాణ్ రామ్ మ్యాజిక్ చేస్తాడని అంతా భావించారు. కానీ కళ్యాణ్ రామ్ సినిమా నిరాశ పర్చింది. మూడు విభిన్నమైన పాత్రల్లో నటించినా కూడా కళ్యాణ్ రామ్ మెప్పించడం లో విఫలం అయ్యాడు. దేశ వ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించిన పఠాన్ తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేక పోయింది. గత రెండు మూడు వారాలుగా వస్తున్న సినిమాలు ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేక పోతున్నాయి. అందుకే ఈ వారం రాబోతున్న సినిమాలపై డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం ధనుష్ నటించిన సార్ సినిమా తో పాటు కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కూడా విడుదల కాబోతుంది. ఒక్క రోజు గ్యాప్ లో ఈ సినిమా లు వస్తాయని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ రెండు ఒకే రోజు రాబోతున్నట్లుగా మరోసారి కన్ఫర్మ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సార్ సినిమా యొక్క ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే వినరో భాగ్యము విష్ణు కథ యొక్క కాన్సెప్ట్ యూత్ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉంది. కనుక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం అనిపిస్తుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!