అహ్మదాబాద్,అక్టోబర్ 31 (ఆంధ్రపత్రిక): గుజరాత్లో కేబుల్ బ్రిడ్జీ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కి చేరింది. మరో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌కు 200 కి.విూ దూరంలో ఉన్న బ్రిటీష్‌కాలం నాటి ఈ బ్రిడ్జీకి మరమ్మత్తులు చేపట్టిన గుజరాత్ ప్రభుత్వం ఈనెల అక్టోబర్ 26న గుజరాతీ న్యూ ఇయర్ సందర్భంగా తిరిగి ప్రారంభించింది. అయితే ఫిట్నెస్ సర్టిపికేట్ లేకుండానే బ్రిడ్జీని ప్రారంభించినట్లు సమాచారం. ఛాత్ పూజ కోసం సుమారు 500 మంది ఆదివారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జీపైకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా బ్రిడ్జీ కూలిపోవడంతో వందలాది మంది మచ్చునదిలో పడిపోయారు. మోర్బీ వంతెన కూలిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వంతెనపై జనం రెట్టింపు సామర్థ్యంతో ఉన్నందున అది కూలిపోయిందని చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం వంతెనపై 400 నుంచి 500 మంది పర్యాటకులు ఉండగా కేబుల్ వంతెన కూలిపోయింది. దీంతో దాదాపుగా 100 మందికి పైగా మరణించారు. కానీ. అద్భుతంగా ఓ నాలుగేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో బాలుడి తల్లిదండ్రులు మృతి చెందడం విచారకరం. ఉమా టౌన్షిప్ నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం, వారి పొరుగువారు హార్దిక్ ఫల్దు, అతని భార్య మిరల్‌బెన్, నాలుగేళ్ల కుమారుడు జియాన్ష్, హార్దిక్ బంధువు హర్ష్ జలవాడియా మరియు అతని భార్య కేబుల్ వంతెనను సందర్శించడానికి వెళ్లారు.ఈ ప్రమాదంలో హార్దిక్, అతని భార్య విూరాల్ చనిపోయారు. కానీ, జియాన్ష్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. జియాన్ష్‌కి అతని మామ హర్ష్ కూడా ఉన్నాడు. గాయపడిన మామ హర్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదంలో హర్ష భార్య కూడా మృతి చెందింది. హార్దిక్ హలవాడ పట్టణానికి చెందినవాడని, సోమవారం పట్టణంలో బంద్ పాటిస్తున్న దృష్ట్యా మృతుల కుటుంబ సభ్యుల మృతదేహాన్ని హలవాడకు తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఉమా పట్టణ వాసి తెలిపారు. వంతెన కూలిపోవడంతో నదిలో పడిన వారిని రక్షించేందుకు అధికారులు స్థానిక ప్రజల సహకారంతో ప్రయత్నించారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర సహాయక బృందాలను హుటాహుటిన ఘటన స్థలానికి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 200 మందికిపైగా రక్షించారు. మరణించే వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జరిగిన ఘటనపై సీఎం భూపేంద్ర పటేల్ ట్వీట్ చేస్తూ, మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అలాగే గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రధాని మోడీ ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని గాంధీనగర్‌కు చేరుకుంటున్నట్లు సీఎం పటేల్ తెలిపారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలకు మార్గనిర్దేశర చేయాలని రాష్ట్ర హోంమంత్రిని కోరారు. కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించగా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.ఘటనపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి గుజరాత్ ప్రభుత్వం అవసరమైన సాయం అందిస్తుందని చెప్పారు. సర్దార్ వల్లభారు పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కెవాడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహానికి నివాళులు అర్పించారు. ఒకవైపు బాధ ఉన్నప్పటికీ..మరో వైపు విధులు నిర్వహించాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు. బ్రిడ్జీ సగం దూరం వెళ్లిన తాము వెనక్కు వచ్చామని అహ్మదాబాద్ నివాసి విజరు గోస్వామి విూడియాకి తెలిపారు. కొందరు యువకులు ఉద్దేశపూర్వకంగా బ్రిడ్జీని కదుపుతుండటంతో నడిచేందుకు కూడా ఇబ్బందిగా మారిందని.. దీంతో వెనక్కి తిరిగి వచ్చామని అన్నారు. అక్కడి సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని.. కొంతసేపటికే బ్రిడ్జీ కూలిపోయిందని అన్నారు. బ్రిడ్జీ కూలిపోవడంతో తాను ఓ తాడును పట్టుకోవడంతో నదిలోకి పడిపోలేదని .. దీంతో మెల్లగా పైకి పాకుతూ వచ్చానని మరో బాలుడు తెలిపారు. బ్రిడ్జీ సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని అనుమతించడంతో ఈ ప్రమాదం జరిగిందని మరో వ్యక్తి తెలిపారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!