మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు.
ఆగస్టు 15 వ తేదీ లోగా వైద్య కళాశాల తుది దశ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలి…!
జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు..! మచిలీపట్నం జూలై 31 ఆంధ్ర పత్రిక.
మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల వివిధ రకాల నిర్మాణ తుది దశ పనులను ఆగస్టు 15వ తేదీ లోగా వేగవంతంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆదేశించారు.
మచిలీపట్నం వైద్య కళాశాల ఆఖరి దగ్గర నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకునేందుకు కలెక్టర్ సోమవారం సాయంత్రం ఆయన చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న మచిలీపట్నం వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలను వేగవంతంగా సమకూర్చుకోవాలని వివిధ విభాగాల అధికారులకు సూచించారు. డిపార్ట్మెంట్ రూమ్ ( స్టాఫ్ రూమ్ ), ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎగ్జామినేషన్ హాల్, బాల బాలికల వసతి గృహాలు తదితర భవనాల్లో పెయింటింగ్ పనులు, విద్యుదీకరణ పనులు, తరగతి గదుల్లో సీట్ల ఏర్పాటు పనులు, సీలింగ్ పనులు, టాయిలెట్స్,
ముమ్మరంగా జరుగుతున్నట్టు వివరించారు. విద్యుదీకరణ, వైరింగ్, తాగునీటి పైప్లైన్లు, ఆడియో వీడియో పరికరాల ఏర్పాటు వంటి అంశాలపై కలెక్టర్ క్షుణంగా తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, హాస్టల్ బ్లాక్‌ల నిర్మాణం గడువులోగా పూర్తిచేస్తామని ఎస్ఇ, ఇఇలు వివరించారు. ఈ సందర్భంగా పలు తరగతి గదుల్లో జరుగుతున్న ఫర్నిచర్ ఏర్పాటు, ల్యాబ్‌ల పనులను గూర్చి కలెక్టర్ ఆరా తీశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన సిబ్బందిని, సామాగ్రిని సమీకరించాలని నిర్మాణ సంస్థకు సూచించారు.వివిధ భవనాల లోపల అవసరమైన ఇంటీరియర్ పరికరాలు అమర్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా నిరంతరాయంగా నాణ్యత గల మెటీరియల్ ను ఉపయోగించాలన్నారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులను మోహరించి పనులు చేపడుతున్నట్టు మేఘా ఇంజినీరింగ్ సంస్థ సైట్ ఇంజినీర్ జగదీష్ తెలిపారు
వైద్య కళాశాల నిర్మాణ పనులకు సంబంధించి సమాచారాన్ని పారదర్శకంగా తెలియజేసేందుకు ఒక వాట్సప్ గ్రూపును క్రియేట్ చేయాలన్నారు. రోజువారి పనుల పురోగతిని ఆ గ్రూపులో పొందుపరచాలన్నారు. అధికారులు చక్కని సమన్వయంతో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, క్షేత్రస్థాయిలో వచ్చే చిన్నచిన్న సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించుకోవాలన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ తుది దశ పనులలో జాప్యం ఆటంకం కలిగించకుండా నిర్దిష్ట సమయానికే పూర్తి చేయాలన్నారు.
షెడ్యూల్ ప్రకారం తుది దశ పనులు పూర్తికాకపోతే, ప్లాన్ బి ప్రణాళిక సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ రాజాబాబు అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, మచిలీపట్నం డివిజన్ ఆర్డీవో ఐ. కిషోర్, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రయ్య, మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధి జగదీష్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఇ సత్యనారాయణ రాజు, వైద్య కళాశాల నిర్మాణ సంస్థ సిబిఆర్ఇ ( పీఎంఇ ) డి ఇ ఇ ఎం. నళిని, డిప్యూటీ మేనేజర్ ఎ. శివ శంకర్, ఎలక్ట్రికల్ డి ఈ సునీల్ కుమార్, ఈఇ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు