- చండీగఢ్ నుంచి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేసిన అధికారులు
న్యూఢిల్లీ: సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చెంపదెప్ప కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కర్నాటక యూనిట్‌కు బదిలీ అయ్యారు.
కానిస్టేబుల్‌పై వేసిన ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు ఇవ్వడానికి మరికొంత టైం పడుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బుధవారం అధికారులు తెలిపారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ జూన్ 6న చంఢీగఢ్ ఎయిర్ పోర్టులో కంగనను చెంపదెబ్బ కొట్టారు.
దీంతో సీఐఎస్ఎఫ్ కుల్వీందర్ ను సస్పెండ్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఈ కమిషన్ రిపోర్టు సమర్పిం చడానికి మరికొంత సమయం పడుతుంది. ఈ క్రమంలోనే ఆమెను బెంగళూరులోని టెన్త్ రిజర్వ్ బెటాలియన్‌కు ట్రాన్స్ ఫర్ చేశారు.