కన్నూర్ : వాషింగ్ మెషీన్ (వాషింగ్ మెషిన్ లో నాగుపాము)లో గుడ్డ ముక్క ఇరుక్కుపోయిందని భావించి దాన్ని తొలగించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అది గుడ్డ ముక్క కాదని, నాగుపాము అని తెలిసి షాక్ కు గురయ్యాడు.
వెంటనే వాషింగ్ మెషీన్ లోపల పెట్టిన చేయి వెనక్కి లాగి ప్రమాదం నుంచి బయటపడ్డ ఘటన చోటుచేసుకుంది.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పాములు ఎక్కడున్నాయో చెప్పడం కష్టం. ఒక్కోసారి ఇంట్లోకి వచ్చి అందరినీ కంగారు పెట్టేస్తుంటారు. పాము కాటు ప్రమాదకరం కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మనకు తెలియకుండానే ఇంట్లోకి వచ్చే పాములు సురక్షితంగా భావించే చోట కూర్చుంటాయి. ఇవి కొన్నిసార్లు ప్రమాదకరంగా మారవచ్చు.
అలాంటి ఘటనే ఇప్పుడు కేరళలోని కన్నూర్‌లో చోటుచేసుకుంది. వాషింగ్ మెషీన్లో ఉన్న నాగుపాము కుటుంబ సభ్యులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
కేరళలోని కన్నూర్‌లో వాషింగ్ మెషిన్ రిపేర్ చేస్తున్న టెక్నీషియన్ జనార్దనన్ కాదంబరి దాదాపుగా మరమ్మతు పనులు పూర్తి చేశారు. రిపేరు అయ్యాక వాషింగ్ మెషీన్ సరిగ్గా పని చేస్తుందో లేదో అని లోపలకి చూసాడు. దానిలోపల గుడ్డ ఉండటాన్ని గమనించి దానిని బయటకు తీయడానికి యంత్రం లోపలకి చేయి వేశాడు. అయితే అది గుడ్డ ముక్క కాదని, నాగుపాము పిల్ల అని తెలుసుకున్న కాదంబరి వెంటనే మెషిన్‌లోంచి తన చేతిని తీసేసింది. దీంతో పాము కాటు నుంచి తృటిలో తప్పించుకుంది. అనంతరం మరో వ్యక్తికి సమాచారం అందించాడు.
కొన్ని రోజులుగా యంత్రం పనిచేయకపోవడంతో రోజుల తరబడి మూత పడి ఉంది. పాము మెషీన్‌లోకి ఎలా వచ్చిందనే దానిపై ఎలాంటి ఆధారాలు లేవని గృహస్థులు తెలిపారు.