Bus Accident: ఆగి ఉన్న లారీని కేవిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి సమీపంలో జరిగింది. దీంతో బస్సులో ప్రయాణం చేస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఉదయం హైదరాబాదు నుంచి ఏలూరు జిల్లా చెక్కపల్లి కి బస్సు బయలు దేరింది. పెనుబల్లి మండలం సీతారామపురం వద్దకు
రాగానే రోడ్డు ప్రక్కనే ఆగివున్న లారీని బస్సు స్పీడ్ లో వచ్చి ఢీ కొట్టింది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. లారీ డ్రైవర్ కాసేపు సేదతీరేందుకు ఉల్లిపాయల లోడ్ తో వున్న లారీని రోడ్డు ప్రక్కకు ఆపాడు. సుమారు 13 మంది ప్రయాణికులతో ఉన్న కేవిఆర్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా లారీ వెనుక భాగానికి బలంగా ఢీకొట్టాడు. దీంతీ ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. స్థానిక సమాచారంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సు ఎమర్జెన్సీ గేటుని ఓపెన్ చేసి అందులో నుంచి ప్రయాణికులు అందరినీ బయట తీశారు. గాయాలైన ప్రయాణికులకు ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్న బస్సులో చాలామంది దిగిపోవడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో నడిపాడా? లేక ఉదయం కావడంతో నిద్రమత్తులో బస్సును నడిపాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేవిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు యజమానులకు సమాచారం ఇచ్చారు. గాయాలై.. చికిత్స పొందుతున్న ప్రయాణికుల బంధువులకు కూడా సమాచారం ఇచ్చేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.