
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి కదా. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ దగ్గర్నుంచి..
కాజల్, కీర్తి సురేష్ వరకు… ఇలా ప్రతి ఒక్క నటీనటులకు సంబంధించిన బాల్యం తాలూకూ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో స్టా్ర్ హీరో చిన్ననాటి ఫోటోస్ సైతం ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. పైన ఫోటోను చూశారు కదా. ఏఎన్నార్ ఎత్తుకున్న ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి. హా.. తను అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరోనే. తొలి తోనే హిట్ అందుకున్నాడు. నటనతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస డిజాస్టర్లతో సతమతమయ్యాడు. ఇక ఇప్పుడు సహాయనటుడిగానూ మెప్పిస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టండి.
ఆ అబ్బాయి … అక్కినేని సుశాంత్ (అనుమోలు). అక్కినేని నాగేశ్వరరావు మనుమడు. నాగార్జున మేనల్లుడు. 2008లో కాళిదాసు తో చిత్రరంగంలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. ఆ తర్వాత 2009లో కరెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుశాంత్. ఈ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అయితే ఈ తర్వాత సుశాంత్ నటించిన చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి.
దీంతో సహాయ నటుడిగానూ మెప్పించాడు సుశాంత్. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురం చిత్రంలో సుశాంత్ కీలకపాత్రలో నటించాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో సుశాంత్ నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కీర్తిసురేష్, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.