- ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు
- ఆరోగ్యం నిలకడగానే ఉందన్న నటుడు నరేశ్
- కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్ధనలు
- విషమంగానే కృష్ణ ఆరోగ్యం: కాంటినెంటల్ వైద్యుల వెల్లడి
- ప్రస్తుతం కృష్ణను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు
- గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ
హైదరాబాద్,నవంబర్ 14 (ఆంధ్రపత్రిక): సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆదివారం కృష్ణ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పటల్లో చేర్పించారు. గత కొద్దిరోజులుగా కృష్ణ అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. ఆయన శ్వాససంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కృష్ణ త్వరగా కోలు కోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన మొదటి భార్య ఇందిరా దేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆలాగే ఆయన రెండో భార్య విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక కృష్ణ మిత్రుడు కృష్ణం రాజు కూడా ఇటీవలే కన్నుమూశారు.ప్రస్తుతం కృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కాంటినెంటల్ హాస్పటల్‌కు మహేష్ బాబు సహా ఇతర కుటుంబసభ్యులు చేరుకున్నారు. ఇదిలా ఉంటే వయసు మీదపడటంతో పాటు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో కృష్ణ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కృష్ణ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై సినీ నటుడు సీనియర్ నరేశ్ స్పందించారు. కృష్ణ స్వల్ప అస్వస ్థతకు గురయ్యారని నరేశ్ తెలిపారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయన్ను ఆదివారం ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణకు చికిత్స అందిస్తున్నట్లు, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సినీనటుడు నరేశ్ పేర్కొన్నారు. 24 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి కృష్ణను డిశ్చార్జ్ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే.. సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం నిలకడగా వుంది. జనరల్ చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్లారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కృష్ణ సన్నిహితులు తెలిపారు.
విషమంగానే కృష్ణ ఆరోగ్యం: కాంటినెంటల్ వైద్యుల వెల్లడి
సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు.ఈ మేరకు వైద్యులు మీడియాకు వివరాలను వెల్లడిరచారు.‘’రాత్రి సుమారు 2 గంటల సమయంలో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశాం. 20 నిమిషాల సీపీఆర్ తర్వాత కార్డియాక్ అరెస్ట్ నుంచి ఆయన బయటకొచ్చారు. అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం అందిస్తున్నాం. రేపు మధ్యాహ్నం మరోసారి మీడియాకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం. మరో 48 గంటల వరకు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేం’’ అని వైద్యులు తెలిపారు.