నెట్ ప్రాక్టీస్‌లో టీమిండియా బ్యాటర్లు
నాగ్‌పూర్,ఫిబ్రవరి4 : స్వదేశంలో వరుసగా వన్డే, టీ ట్వంటీలు నెగ్గి జోష్ విూదున్న టీమిండియా.. టెస్ట్ ఫార్మాట్లో అసలు సమరానికి రెడీ అవుతోంది. ఈ నెల 9 నుంచి ఆస్టేల్రియాతో మొదలయ్యే నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ బోర్డర్`గావస్కర్`ట్రోఫీ కోసం ప్రాక్టీస్ షురూ చేసింది. ఈ మెగా సిరీస్ కోసం బీసీసీఐ.. ఐదు రోజుల క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఓల్డ్ వాకా స్టేడియంలో నెట్నెషన్స్ లో ప్రాక్టీస్ చేసింది. నెట్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, శుభ్‌మన్ గిల్తీవ్రంగా చెమటోడ్చారు. ఈ సిరీస్ నెగ్గితే అటు వరల్డ్చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌తో పాటు లాంగ్ ఫార్మాట్లో నంబర్‌వన్ ర్యాంక్ దక్కే అవకాశం ఉండటంతో.. ఇండియా ఏ చాన్స్‌ను వదులుకోవడం లేదు. గాయంతో శ్రేయస్ అయ్యర్ తొలి టెస్టుకు దూరం అవ్వగా.. మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న రవీంద్ర జడేజాతో పాటు, తెలుగు వికెట్ కీపర్ కేఎస్ భరత్ నెట్స్‌లో శ్రమించారు. జడేజా తొలుత ఇండోర్ సెషన్లో బౌలింగ్, బ్యాటింగ్ చేశాడు. తర్వాత బయట నెట్స్‌లోనూ బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. మార్నింగ్ సెషన్లో రెండున్నర గంటల పాటు ఓ బ్యాచ్ ట్రెయినింగ్‌లో పాల్గొనగా.. మధ్యాహ్నం మరో బ్యాచ్ చెమటోడ్చింది. ఇక, టీమిండియా నెట్ ప్రాక్టీస్ కోసం బీసీసీఐ కేవలం స్పిన్నర్లనే కేటాయించింది. వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, రాహుల్చహర్, సాయి కిశోర్ ఇందులో ఉన్నారు. ఎక్స్ట్రా పేసర్ల గురించి టీమిండియా ఎక్కువగా ఆలోచించడం లేదు. ఇక మెయిన్ టీమ్‌లో అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్, జడేజా ఉన్నారు. మరో రెండు రోజుల ప్రాక్టీస్ తర్వాత.. ఆసీస్ బలాన్ని లెక్కలోకి తీసుకుని టీమిండియా ఫైనల్ ఎలెవన్‌పై ఓ అంచనాకు రావొచ్చు. ఫ్రెండ్లీ వికెట్లపై ఇండియాను దీటుగా ఎదుర్కొనేందుకు ఆసీస్ కూడా అంతే పకడ్బందీగా ప్లాన్స్ రెడీ చేస్తోంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!