వైఎస్ షర్మిల అరెస్ట్..వరంగల్‌కు తరలింపు
నర్సంపేటలో షర్మిల కాన్వాయ్‌లో బస్సు దగ్ధం
ఎమ్మెల్యే పెద్దిపై అనుచిత వ్యాఖ్యలతో టిఆర్ఎస్ ఆగ్రహం
వరంగల్,నవంబర్ 28 (ఆంధ్రపత్రిక): వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. నర్సంపేట్ నియోజ కవర్గంలో షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. చెన్నారావుపేట మండలం లింగగిరిలో లంచ్ బ్రేక్‌లో కాన్వాయ్‌లోని బస్‌ను టీఆర్ఎస్ అనుచరులు తగలబెట్టారు. షర్మిల పాదయాత్ర వాహనాలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రు వ్వారు. పలు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు షర్మిల కాన్వాయ్‌లోని ఒక బస్సుకు నిప్పు పెట్టారు. షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేశా రని అటు వైఎస్సార్టీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉద్రిక్తంగా మారడంతో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శంకరమ్మ తండా వద్ద షర్మిల కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు మరోసారి రాళ్ల దాడి చేశారు. పోలీస్ బందోబస్తు ఉన్నా షర్మిల వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వైయస్సార్ విగ్రహంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడిచేసి నిప్పు పెట్టారు. దీంతో వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. వైఎస్ విగ్రహాన్ని, పార్టీ ప్లెక్సీలను దగ్ధం చేయడాన్ని గ్రామస్తులు అడ్డు కున్నారు. టీఆర్ఎస్ లీడర్లు గ్రామస్తులపై కోడిగుడ్లు రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో భారీ పోలీస్ కాన్వా య్‌తో ఆమెను వరంగల్‌కు తరలించారు. నర్సంపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఇంకా ఆందో ళనలు కొనసాగుతు న్నాయి. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అసలు షర్మిలకు తెలంగాణలో పాదయాత్ర చేసే హక్కే లేదని గులాబీ నేతలు నిరసనకు దిగారు. గో బ్యాక్ షర్మిల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. షర్మిల ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రస్థానం పాద యాత్రను అడ్డుకుని..తనను అరెస్ట్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభు త్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పాదయాత్రలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి యాత్రను అడ్డుకునేందుకే బస్సును తగలబెట్టారని మండి పడ్డారు. పోలీసులు దగ్గరుండి దాడి చేయించారని తెలిపారు. బస్సు అద్దాలు రాళ్లతో పగలగొట్టి, కారుతో దాడి చేయించి..వైఎస్సార్టీపీ కార్యకర్తలను కొట్టారని చెప్పారు.బస్సుకు నిప్పు పెట్టిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు పర్మీషన్ ఉందని..కావాలనే పాదయాత్ర వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపించారు. బస్సుకు నిప్పు పెట్టిన అనంతరం తమ కార్యకర్తలు ఎంతో శ్రమించి మంటలను ఆర్పివేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదని సూచించారు. ఇలాంటి దాడులకు భయపడబోమని..ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్రను ఆపేది లేదని తేల్చిచెప్పారు. ప్రజా సమస్యలపైనే తాను పోరాడుతున్నాని వైఎస్ షర్మిల అన్నారు. ప్రభుత్వ వైఫ ల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని బెదిరింపులు, ప్రలోభాలు, దాడులు చేసినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే వరుకు తన పోరాటం ఆగదన్నారు.