ఓయూలో నిరుద్యోగ జెఎసి దీక్ష
దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు
దీక్షకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం
దమ్ముంటే క్యాంపస్‌కు వచ్చి మాట్లాడాలి
కెసిఆర్,కెటిఆర్‌లకు రేవంత్ సవాల్
హైదరాబాద్, మార్చి 24, ఆంధ్రపత్రిక: ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో జరుగనున్న నిరుద్యోగ దీక్షకు వెళ్లనీయకుండా కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రేవంత్ రెడ్డి, మల్లు రవి, అద్దంకి దయాకర్ తదితరులను గృహనిర్బంధం చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా చేపట్టిన నిరుద్యోగ మార్చ్, నిరసన దీక్ష నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఈ నిరసన దీక్షకు ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించారు.జూబ్లిహిల్స్ లోని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు మల్లు రవి, అద్దంకి, చామల కిరణ్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ముందస్తు అరెస్టులను విద్యార్థి సంఘాల నేతలు ఖండిరచారు. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మరోవైపు క్యాంపస్ లోకి బయటి వ్యక్తులకు అనుమతి లేదని ఓయూ వీసీ స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఓయూలో ఏం జరగబోతుందన్న దానిపై టెన్షన్ వాతావరణం నెలకొంది. పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని 24, 25వ తేదీల్లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు మహాదీక్షకు విద్యార్థులు పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీ బాధ్యులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేసారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థులు పట్టుపడుతున్నారు. న్యాయపరంగా తాము పోరాటం చేస్తుంటే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడమేంటంటని ప్రశ్నించారు. అటు క్యాంపస్ కి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేశారు. ఎవరిని లోపలికి అనుమతించలేదు. మరోవైపు నిర్యుద్యోగ మార్చ్‌కు విద్యార్థి సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఓయూ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకున్నారు. దీక్షకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు క్యాంపస్ లో హై అలెర్ట్‌ను ప్రకటించారు. ఇదిలావుంటే తమను గృహనిర్బంధం చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. పోలీసులను పంపి, నన్ను గృహనిర్భందం చేయడం కాదు? కేసీఆర్,కేటీఆర్‌లకు దమ్ముంటే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల కుంభకోణంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో చర్చకు రావాలి. విూరు సచ్ఛీలురైతే, స్కాంలో విూ పాత్రలేకపోతే నా సవాల్‌ను స్వీకరించాలని అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. కాగా.. నిరుద్యోగ మహాదీక్షకు రేవంత్ హాజరు కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఓయూ జేఏసీ దీక్షకు అనుమతి లేదంటూ.. రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళకుండా అరెస్ట్ చేసేందుకు పోలీస్‌లు అడ్డుకుని గృహనిర్బంధం చేశారు. అయితే ఓయూకు వెళ్లి తీరతానని రేవంత్ చెబుతున్నారు. దీక్ష జరిగి తీరుతుందని ఓయూ విద్యార్థులు స్పష్టం చేసారు. ఓయూకు వస్తే రేవంత్‌ను అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్వీ హెచ్చరిస్తోంది. అయితే రేవంత్ మహాదీక్షకు హాజరు కానున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేశారు. రేవంత్ ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!