కాకినాడ,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ):కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. గతవారం ధవళేశ్వరం నుంచి పెద్దఎత్తున వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో గౌతవిూ గోదావరి నదీపాయకు ఆనుకుని ఉన్న ఎనిమిది కాలనీలు 10 రోజులుగా నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి. సుమారు 1500 కుటుంబాలు వరద నీటిలోనే ఉండడంతో పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో దాతలు రెండు పూటల భోజనాలు.. త్రాగునీరు పడవలపై తీసుకువెళ్లి బాధితులకు అందజేస్తున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గత వారంలో లక్షలాది క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదలడంతో.. గౌతవిూ గోదావరి నదీపాయకు ఆనుకుని ఉన్న కాలనీలు పది రోజులపాటు నీటిలోనే చిక్కుకున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుని రోజు వారి జీవనానికి అలవాటుపడిన ప్రజలకు మళ్లీ వరద నీరు పోటెత్తింది. దీంతో ఫ్రాన్స్‌తిప్ప, కోన వెంకటరత్నం నగర్, ఫెర్రీ రోడ్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. సుమారు 1500 కుటుంబాలు ఐదు రోజులుగా వరద నీటిలోనే ఉండడంతో పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో.. దాతల సహకారంతో రెండు పూటలకు సరిపడే భోజనాలు, త్రాగునీటిని పడవలపై తీసుకువెళ్లి బాధితులకు ఇంటి వద్దనే అందజేస్తున్నారు. పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో వచ్చిన వరదల సమయంలో తక్షణ సహాయంగా 5 వేల రూపాయలు బాధితులకు అందజేసింది. నెలరోజులు గడవక ముందే మళ్లీ వరదలు రావడంతో ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు. స్థానిక అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు రావాలని కోరుతున్నా.. ఎవరూ రాకపోవడంతో ఆ ప్రాంతాల్లో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు ఎప్పటికప్పుడు చర్యలు
తీసుకుంటున్నాయి.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!