ఇప్పటి వరకూ మనం తమిళ ఇండస్టీ నుంచి వచ్చిన దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడమే చూశాం. కానీ.. మన దగ్గర నుంచి దర్శకులు వెళ్లి తమిళ హీరోలతో సినిమాలు చేసింది చాలా అరుదు. ఒకప్పుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ లాంటి లెజెండరీ దర్శకులు కమల్ హాసన్, మమ్ముట్టి వంటి ఇతర భాష సూపర్ స్టార్లతో సినిమాలు చేశారు. కానీ, గత రెండు దశాబ్దాలలో మన దర్శకులు తమిళ ఇండస్ట్రీ వెళ్లి సినిమాలు చేసిన దాఖలాలు లేవు. అయితే, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు మారుతున్నాయి. నేటి జనరేషన్ దర్శకులు తమిళ్ ఇండస్టీల్రో హిట్స్ కొడుతున్నారు. తాజాగా మరో తెలుగు దర్శకుడు తమిళనాట తన సత్తా చూపించాడు. ధనుష్ హీరోగా వెంకి అట్లూరి తెరకెక్కించిన ’వాతి’సినిమా తమిళం లో సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. ఇదే సినిమా తెలుగులో ’సార్’ పేరుతో వచ్చింది. ఇక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మూడు రోజుల్లోనే 9 కోట్ల షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మరోవైపు తమిళంలో కూడా ’వాతి’ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సరైన విజయం కోసం చూస్తున్న ధనుష్ కు చివరికి ఒక తెలుగు దర్శకుడు హిట్ ఇవ్వడం మనవాళ్లకు కాలర్ ఎగరేసే మూమెంట్. ఇదిలా ఉంటే సంక్రాంతికి విడుదలైన ’వారసుడు’ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. దీనికి దర్శకుడు వంశీ పైడిపల్లి విజయ్ హీరోగా వచ్చిన ’వారిసు’ సినిమా తమిళంలో రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులోనూ ’వారసుడు’ 15 కోట్ల షేర్ వసూలు చేసి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల విజయాలతో తెలుగు దర్శకులపై తమిళంలో క్రేజ్ పెరిగింది. దానికి తోడు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటికే అరవంలో తన జెండా పాతేశారు. ’బాహుబలి`2’ అక్కడ సినిమాల రికార్డులను కూడా కొల్లగొట్టి రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతోపాటు ’ఆర్ఆర్ఆర్’ కూడా మంచి వసూళ్లు సాధించింది. తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా తమిళ్ ఇండస్టీల్రోకి అడుగు పెడుతున్నారు. ధనుష్‌తో ఈయన సినిమా ఓకే అయింది. మొత్తానికి ఈ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ హీరోలందరూ తెలుగు దర్శకుల వెంట పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ సక్సెస్ అందుకుంటున్న టాలీవుడ్ దర్శకులు తమిళ్ ఇండస్ట్రీ సత్తా చాటుతారో లేదో చూడాలి మరి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!