ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు..
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవం విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు రూ. 140 కోట్లతో రెండు జతల యూనిఫామ్స్, రూ. 190 కోట్లతో ఉచితంగా టెక్స్ట్ బుక్స్, సంవత్సరం పొడవునా రూ. 35 కోట్ల ఖర్చుతో రాగి జావా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారని ట్విట్టర్లో పేర్కొన్నారు. 12 లక్షల 50 వేల మంది విద్యార్థులకు రూ. 56 కోట్ల విలువ గల నోట్ బుక్స్, 34.25 కోట్ల విలువ చేసే ట్యాబ్స్ 19,800 మంది టీచర్స్‌కు అందించనున్నారు.
మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 9123, పాఠశాలలో 3497.62 కోట్లతో పనులు చేపట్టి ఇవాళ దాదాపు 1000 పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. పెద్ద ఎత్తున విద్యా రంగానికి నిధులు కేటాయిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.