తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసి అధిష్టానానికి ఆ జాబితాను పంపించాలని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే 100 వంద నియోజవకవర్గాలకు ఒక్కో అభ్యర్థి పేరుతో ఈ జాబితాను పంపాలని నిర్ణయించింది. బుధవారం నాడు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమే.. ఈ అశంపై చర్చలు జరిపింది.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసి అధిష్టానానికి ఆ జాబితాను పంపించాలని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే 100 వంద నియోజవకవర్గాలకు ఒక్కో అభ్యర్థి పేరుతో ఈ జాబితాను పంపాలని నిర్ణయించింది. బుధవారం నాడు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమే.. ఈ అశంపై చర్చలు జరిపింది. కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌తో సహా.. సభ్యులు మాణిక్‌రావ్ ఠాక్రే, ఉత్తమ్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితర నేతలు పాల్గొన్నారు. అయితే మరో సభ్యుడు.. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ ఆయన అనారోగ్యం కారణంతో ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. అయితే ఈ సమావేశంలోభాగంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ల కోసం అప్లై చేసుకున్న వారి వివరాలు, ప్రదేశ్ ఎన్నికల కమిటీకి ఇచ్చినటువంటి నివేదికలను నేతలను పరిశీలన చేశారు.
ముందుగా స్క్రీనింగ్ కమిటీలో రాష్ట్రం నుంచి సభ్యులగా ఉన్న రేవంత్, ఉత్తమ్, భట్టీ.. వివిధ చోట్ల నుంచి టికెట్ల ఖరారు ప్రాథమ్యాల గురించి వివరించారు. ఆ తర్వాత రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా టికెట్ల కేటాయింపు, మహిళలకు కేటాయించాల్సిన సీట్లు.. అలాగే యువతకు టికెట్లు వంటి తదితర అంశాలపై చర్చలు జరిపారు. అయితే ఎక్కడెక్కడ ఏ కేటగిరీ నాయకులకు అవకాశం ఇవ్వగలమనే దానిపై పరిశీలన చేశారు. మరో విషయం ఏంటంటే ఏఐసీసీకి పంపే జాబితాను అన్ని కోణాల్లో స్పష్టంగా నిర్ధారించి పంపాలని.. మెజార్టీ స్థానాల్లో ఒక్కటే పేరును సూచించేలా కసరత్తలు పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చారు. దాదాపు రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగినప్పటికీ.. నియోజకవర్గాలవారిగా కసరత్తు పూర్తి కాలేదు. దీంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా మొత్తం పూర్తి కాలేదని.. సమావేశంలో భాగంగా అన్ని అంశాలపై పరిశీలన చేశామని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తెలిపారు. అయితే ఇది పూర్తి కావడానికి మరో రెండు వారాల పాటు సమయం పడుతుందని.. మెజార్టీ స్తానలకు ఒక్కటే పేరును పంపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే త్వరలోనే మరోసారి సమావేశం జరగనుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ పీఈసీ సమావేశంలో వచ్చినటువంటి అభిప్రాయాలను సుధీర్ఘంగా చర్చించామని.. పీఈసీ సభ్యులతో సహా డీసీసీలు, మాజీ మంత్రులు అవాగే సినియర్ నాయకుల సలహాలను తీసుకున్నామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేపేర్కొన్నారు. ఇంకా చర్చించాల్సినవి కూడా చాలా ఉన్నాయని చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి ప్రామాణికలను అనుసరించాలన్న దానిపై చర్చలు జరిపామని.. త్వరలోనే మరోసారి సమావేశమవుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.