తెలంగాణలో వానాకాలం సీజన్ ఒడిదొడుకులతో సాగుతుంది. దీంతో పంట సాగు చేసేందుకు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే అన్నదాతలకు సాయంగా నిలవాల్సిన బ్యాంకుల వైఖరి మాత్రం వారికి అనుకూలంగా ఉండటం లేదు. వ్యవసాయానికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణసాయాన్ని అందించాల్సి ఉన్నప్పటికీ కూడా బ్యాంకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికీ మూడు నెలలు గడచాయి. కానీ ఇంకా కేవలం 35 శాతం మాత్రమే రుణాలను అందించాయి.
తెలంగాణలో వానాకాలం సీజన్ ఒడిదొడుకులతో సాగుతుంది. దీంతో పంట సాగు చేసేందుకు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే అన్నదాతలకు సాయంగా నిలవాల్సిన బ్యాంకుల వైఖరి మాత్రం వారికి అనుకూలంగా ఉండటం లేదు. వ్యవసాయానికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణసాయాన్ని అందించాల్సి ఉన్నప్పటికీ కూడా బ్యాంకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికీ మూడు నెలలు గడచాయి. కానీ ఇంకా కేవలం 35 శాతం మాత్రమే రుణాలను అందించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పరిధిలో రైతుల్లో అధికశాతం మందికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు మాత్రం బ్యాంకులు నిరాకరించాయి. వీటితో పాటుగా వివిధ కారణాల వల్ల రైతులకు మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది. ఇక 2023-24 వార్షిక రుణప్రణాళిక కింద ఈ వానాకాలం సీజన్లో 83 వేల 391 కోట్ల మేరకు అన్నదాతలకు రుణసాయం అందజేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
అంతేకాదు ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని సూచనలు చేసింది. అలాగే పంట సాగు పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున కొంతవరకు సాయం చేస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికే మూడేసి సార్లు విత్తనాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అతివృష్టి వల్ల కొంత నష్టం కూడా జరిగిపోయింది. దీనివల్ల రైతులకు మళ్లీ పెట్టుబడుల కోసం రుణాలు అవసరమయ్యాయి. బ్యాంకుల నుంచి రుణసాయం పొందడానికి కష్టంగా మారడం వల్ల రైతులు ప్రైవేటు వడ్డి వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. అలాగే పంట రుణాలే కాదు.. యంత్రాలు, పాడి ఇతర అనుబంధ రంగాలకు సంబంధించి కూడా రుణాలను బ్యాంకులు సరిగా ఇవ్వడం లేదని రైతులు ఆరోపణలు చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో పంటల సాగు ప్రతి సంవత్సరం పెరుగుతున్నందువల్ల ప్రభుత్వం అన్నదాతలను ప్రోత్సహించేందుకు పంట రుణాలు పెద్దఎత్తున ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని బ్యాంకులను కోరుతోంది. మార్చి 21న జరిగినటువంటి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఆర్థిక, వ్యవసాయ మంత్రులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. వానాకాలం సీజన్లో వందశాతం లక్ష్యాలను సాధించాలని కోరారు. అయితే ఆ తర్వాత మే 19న జరిగిన సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. అలాగే రైతులకు సరిగా రుణాలు ఇవ్వడం లేదని రాష్ట్ర మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే బ్యాంకర్లు సైతం ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. అయినా కూడా బ్యాంకుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ప్రక్రియను చేపట్టింది. అయితే ఖాతాల్లో ఆ సొమ్ము జమ అయినతర్వాత.. రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లినా కూడా.. వడ్డితో సహా మొత్తం చెల్లిస్తేనే రుణం అందిస్తామని చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరగడం ఆందోళన కలిగిస్తుంది.