తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రాక పెరుగుతూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వరుసగా క్యూ కడుతున్నాయి. అయితే తాజాగా మరో భారీ పెట్టుబడి తెలంగాణకు రానుంది. సింటెక్స్ అనే కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 350 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. వాస్తవానికి వెల్ స్పన్ గ్రూప్ అనే సంస్థకు భాగస్వామిగా ఉన్నటువంటి సింటెక్స్.. తన తయారీ యూనిట్ కోసం 350 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. సింటెక్స్ తయారు యూనిట్ నెలకొల్పడం వల్ల దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రాబోతున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రాక పెరుగుతూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వరుసగా క్యూ కడుతున్నాయి. అయితే తాజాగా మరో భారీ పెట్టుబడి తెలంగాణకు రానుంది. సింటెక్స్ అనే కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 350 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. వాస్తవానికి వెల్ స్పన్ గ్రూప్ అనే సంస్థకు భాగస్వామిగా ఉన్నటువంటి సింటెక్స్.. తన తయారీ యూనిట్ కోసం 350 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. సింటెక్స్ తయారు యూనిట్ నెలకొల్పడం వల్ల దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే సింటెక్స్.. తయారీ యూనిట్‌ను రంగారెడ్డి జిల్లా చందన్వల్లిలో ఏర్పాటు చేయనుంది. అయితే ఈ తయారీ యూనిట్ నుంచిసింటెక్స్ కంపెనీ వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపోనెంట్స్‌తో పాటు ఇతర పరికరాలను తయారు చేయబోతుందని అధికారులు అంటున్నారు.
అయితే మరో విషయం ఏంటంటే.. సింటెక్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమం సెప్టెంబర్ 28వ తేదీన నిర్వహించనున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని వెల్ స్పన్ కంపెనీ ఛైర్మన్ బీకే గోయెంకా, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. అయితే వెల్ స్పన్ గ్రూప్ తెలంగాణలో ఇప్పటికే విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే తమ కంపెనీని మరింతగా విస్తరించే ఉద్దేశంతో మరో తయారీ ప్లాంట్‌ను పెట్టడానికి ముందుకొచ్చిన సంస్థకు మంత్రి కేటీఆర్ అభినలు తెలియజేశారు. ఇక వెల్ స్పన్ గ్రూపు భాగస్వామిగా ఉన్నటువంటి సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో మరో రూ.350 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నందుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల పెట్టుబడులు తరలి వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలోకార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి కంపెనీలు.. ఇంకా విస్తరించేందుకు ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.