దీర్ఘ కాలిక డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రేషన్ డీలర్ల సంఘం పౌరసరఫరల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో మంగళవారం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మంత్రి ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్లు సమ్మే విరమించి దుకాణాలు తెరిచారు. మంగళవారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ చేయడం ప్రారంభించారు.
దీర్ఘ కాలిక డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రేషన్ డీలర్ల సంఘం పౌరసరఫరల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో మంగళవారం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మంత్రి ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్లు సమ్మే విరమించి దుకాణాలు తెరిచారు. మంగళవారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ చేయడం ప్రారంభించారు. రేషన్ డీలర్లు.. కమీషన్ పెంపు, గౌరవ వేతనం అమలు వంటి 22 డిమాండ్ల కోసం గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని 17,284 రేషన్ దుకాణాలను మూసివేసి సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్‌తో రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు మంగళవారం చర్చలు జరిపారు.
సాయంత్రం 6 గంటల తరువాత సమావేశం ముగియగా, చర్చలు సఫలమైనట్లు డీలర్లు ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు డీలర్ల డిమాండ్ల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి సూచనల మేరకు సమ్మె విరమిస్తున్నట్లు మంత్రి కమలాకర్ సమక్షంలోనే ప్రకటించారు. జూలై లోపు తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందని, గౌరవ వేతనం, ఇన్సూరెన్స్ అంశాలు సీఎం కేసీఆర్ పరిధిలో ఉన్నందున సమ్మెను విరమించి, రేషన్ దుకాణాలు తెరుస్తున్నట్లు పేర్కొన్నారు.