తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికల కోసం తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే బుధ, గురువారాల్లో వరుసగా స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశాలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్క్రీనింగ్ కమిటీ సమవేశాలకు రానున్నారు. అలాగే ఢిల్లీలో కూడా ఏఐసీసీ కార్యాలయంలో గురువారం మళ్లీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికల కోసం తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే బుధ, గురువారాల్లో వరుసగా స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశాలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్క్రీనింగ్ కమిటీ సమవేశాలకు రానున్నారు. అలాగే ఢిల్లీలో కూడా ఏఐసీసీ కార్యాలయంలో గురువారం మళ్లీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. అయితే ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా ఈ సమావేశంలో పాల్గొనన్నారు.
అయితే టీపీసీసీ పొలిటికల్ అపైర్స్ కమిటీ సూచించినటువంటి జాబితాను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. అనంతరం అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాను పూర్తిగా సిద్దం చేసిన అనంతంరం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి ఈ జాబితాను పంపించనుంది. అయితే ఈ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను పూర్తిగా పరిశీలించిన తర్వాత అధిష్టానానికి ఈ జాబితా పంపనుంది. ఆ తర్వాత హైకమాండ్ అభ్యర్థులను ఫైనల్ చేస్తుంది. ఇదిలా ఉండగా.. వివిధ సర్వే రిపోర్టులు, నియోజకవర్గాల్లోని స్థానిక పరిస్థితులను అంచనా వేసి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వనున్నారు. అయితే ఈ నెల చివరి వరకు తొలి జాబితాను సిద్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇక దసరా పండగ నాటికి 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖారారు కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. తెలంగాణ కాంగ్రెస్లో గతంలో జరిగినట్లుగా పరిస్థితులు లేకుండా సీనియర్ నేతలను లైన్లో పెడుతున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కమిటీల్లో కూడా ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీలకు ఈ స్క్రీనింగ్ కమిటీలో చోటును కల్పించారు. ఇదివరకు వారిద్దరూ కూడా అసంతృప్తిగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు స్క్రీనింగ్ కమిటీలో వారికి చోటు కల్పించారు. అంతేకాదు.. మరోవైపు బస్సు యాత్రకు కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రణాళిక చేసింది. అలాగే పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఈ యత్రను చేపట్టాలని పార్టీ నేతలు తీర్మానించారు. అలాగే ఇందుకు సంబంధించిన తేదీలను కూడా త్వరలోనే ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. అలాగే యాత్రలో పార్టీ సీనియర్నేతలందరూ పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూర్తిగా డామినేట్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నప్పటికీ.. ఆయనకు పూర్తిగా చార్జ్ ఇవ్వలేదని పార్టీ అధిష్ఠానం ఆలోచనలతోనే అన్నీ జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్న సంకేతాలు కూడా రావడంతో.. కాంగ్రెస్ లో పరిస్థితి లైన్ లోకి వచ్చిందనే సూచనలు కనిపిస్తున్నాయి.