మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్స్ పార్టీకి పెట్టింది పేరు.. గతంలో ఇందిరాగాంధీ ఇక్కడి నుండే ఎంపీగా పోటీ చేసి గెలిచి దేశ ప్రధాని కూడా అయ్యారు. అలాంటి చోట పార్టీ ఎలా ఉండాలి…! వార్ వన్ సైడ్ అన్నట్లు ఉండాలి.. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మెదక్ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్స్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్స్ పార్టీకి మంచి…
ఆ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్స్ పార్టీకి కంచుకోట..కానీ ప్రస్తుతం సీన్ మారింది. అక్కడ హస్తం పార్టీలో ఉన్న నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తు న్నారట. ఇదే అక్కడ పార్టీ ఎదుగుదలకు పెద్ద అవరోధం గా మారుతోందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ..?ఎవరా నేతలు..? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్స్ పార్టీకి పెట్టింది పేరు.. గతంలో ఇందిరాగాంధీ ఇక్కడి నుండే ఎంపీగా పోటీ చేసి గెలిచి దేశ ప్రధాని కూడా అయ్యారు. అలాంటి చోట పార్టీ ఎలా ఉండాలి…! వార్ వన్ సైడ్ అన్నట్లు ఉండాలి.. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మెదక్ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్స్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్స్ పార్టీకి మంచి ఓట్లే వస్తాయి. కానీ ఇక్కడ ఉన్న నేతలే ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా ఉన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి అర్ధంకాని పరిస్థితి నేతల మధ్య ఐకమత్యం లేకపోవడం అనేది పెద్ద మైనస్. మెదక్ నియోజకవర్గ పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డికి అసలు పొసగడం లేదని పొలిటికల్ సర్కిల్స్ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇద్దరిలో ఎవరు ఏ కార్యక్రమం చేసిన కూడా ఎవరికి వారే చేసుకుంటున్నారట. గత కొద్దిరోజులుగా ఇదే తంతు కొనసాగుతుందట. గతంలో కూడా ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు న్యాయం చేయాలని పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తే.. అదే రోజు జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి రామయంపేట డివిజన్ ఏర్పాటు కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. మొన్నటికి మొన్న మెదక్ కు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని మ్యాడం బాలకృష్ణ మెదక్ బంద్ కు పిలుపునిస్తే.. ఈ కార్యక్రమంకు మాకు ఏలాంటి సంబంధం లేదు అని జిల్లా అధ్యక్షుడు వర్గం చెప్పేసారట.
దీంతో మెదక్ బంద్ కార్యక్రమంలో మ్యాడం బాలకృష్ణ ఆధ్వర్యంలోనే కొనసాగిందని టాక్. ఆ ప్రోగ్రాం కొంత సక్సెస్ కావడంతో పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలక్రిష్ణ వర్గంకు జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి వర్గంకు మధ్య గ్యాబ్ ఇంకా పెరిగిందట. మెదక్ కాంగ్రెస్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం మ్యాడం బాలకృష్ణ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడట. ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరి మధ్య గట్టి పోటీ కూడా ఉందట. అందుకే ఒకరి పై ఒకరికి రోజు రోజుకు గ్యాబ్ పెరిగిపోతుందట. ఇక మ్యాడం బాలకృష్ణ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ సామాజిక వర్గానికి చెందిన వారికి తక్కువ సీట్లు ఇస్తారు కాబట్టి ఈ సారి తన పేరు పరిశీలనలో ఉంటుందని ఆశతో ఉన్నాడట మ్యాడం బాలకృష్ణ.
జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కూడా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసిన కూడా మ్యాడం బాలకృష్ణ వర్గానికి సమాచారం ఇవ్వడం లేదట, అందుకే నియోజకవర్గ పరిధిలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ పార్టీ పెద్దల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నాడట మ్యాడం బాలకృష్ణ. అందుకే ఈ ఇద్దరి నేతలకు అసలు పడడం లేదట.. మొన్నటికి మొన్న జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి చేపట్టిన గడప గడపకు కాంగ్రెస్స్ పార్టీ కార్యక్రమానికి తన ప్రచార రథాన్ని తీసుకురావడంతో ఒక్కసారి పెద్ద గొడవ జరిగింది. పార్టీ కార్యక్రమానికి నీ పేరుతో ఉన్న ప్రచార రథాన్ని ఎలా తీసుకొని వస్తావు అని మ్యాడం బాలకృష్ణ వర్గం, తిరుపతి రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి.
ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి జోక్యం చేసుకొని ఇరు వర్గాలను శాంతింప చేశాడట.. ఇలా మెదక్ కాంగ్రెస్స్ లో ఎవరికి వారు తమకు నచ్చిన కార్యక్రమాలు చేస్తూ.. నియోజకవర్గ పరిధిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కన్ఫ్యూజ్ కు గురి చేస్తున్నారట.. ఈ ఇద్దరి నేతల మధ్య వాళ్ళు నలిగిపో తున్నారట. ఒకరి వైపు వెళ్తే ఒకరికి కోపం అని.. చాలా మంది కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమ నాయకులు కలిసి ఉంటే బాగుంటుంది కానీ ఈ గొడవలు ఏంటంటూ బహిరంగానే చర్చించుకుంటున్నారు.