రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై టి-హబ్ 2 భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన యూనికార్న్ స్టార్ట్‌ప్సతో ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. టిహబ్ భవనాన్ని మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం యూనికార్న్ స్టార్ట్‌పల వ్యవస్థాపకులను సన్మానించారు. అదే రోజు రాత్రి కేటీఆర్ వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలను రూపొందించామన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ వంటి ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ప్రారంభించాయని, ఐటీ రంగంలో ప్రపంచపటంలో నగరానికి విశిష్టస్థానం ఉందన్నారు. పెట్టుబడులకు సిద్ధమైతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. లీడ్ స్కూల్ వ్యవస్థాపకుడు సుమీత్ మెహతా మంత్రితో సమావేశం సందర్భంగా విద్యారంగాభివృద్ధిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. స్టార్టప్ సంస్కృతికి అనుగుణంగా విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులను వివరించారు. ఈ దిశగా లీడ్ స్కూల్ చేపడుతున్న కార్యక్రమాలను మంత్రికి తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి మెహతాను కోరారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!