రాష్ట్రంలో 9355 మంది జేపీఎస్‌లు పనిచేస్తున్నారు. అయితే వారిని రెగ్యలరైజ్ చేసి.. నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చాలని రాష్ట్ర సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. నాలుగు సంవత్సరాలు నిరాటంక సర్వీసు, పనితీరు ప్రాతిపదికగా అర్హులను గుర్తించాలని గతంలో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ మేరకు జిల్లాల్లోని వారి పనితీరును మదింపు చేసి 6616 మందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా గుర్తించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు రావడంతో.. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ వినతి మేరకు కొత్తగా నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేసింది.
తెలంగాణలో నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో క్రమబద్ధీకరించినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను 6603 పోస్టుల్లో నియమాంచాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక మరో 3065 పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని.. రాబోయే రోజుల్లో క్రమబద్ధీకరిచే కార్యదర్శులను వాటిలో నియమించడానికి వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం జేపీఎస్‌లకు నెలకు రూ.28,719 వేతనం వస్తోంది. అయితే నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు వేతన స్కేల్‌ను రూ.24,280 – 72,850 వరకు వేతనం ఇవ్వనుంది. రాష్ట్రంలో 9355 మంది జేపీఎస్‌లు పనిచేస్తున్నారు. అయితే వారిని రెగ్యలరైజ్ చేసి.. నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చాలని రాష్ట్ర సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. నాలుగు సంవత్సరాలు నిరాటంక సర్వీసు, పనితీరు ప్రాతిపదికగా అర్హులనుగుర్తించాలని గతంలో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ మేరకు జిల్లాల్లోని వారి పనితీరును మదింపు చేసి 6616 మందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా గుర్తించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు రావడంతో.. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ వినతి మేరకు కొత్తగా నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేసింది. అయితే ఈ మంజూరు చేసినటువంటి పోస్టుల కంటే 13 మంది అర్హులు ఎక్కువగా ఉండటం వల్ల.. ఇప్పటికే శాఖపరంగా ఉన్నటువంటి 3065 పోస్టుల్లో వారిని సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో 9355 మంది జేపీఎస్‌లు విధులు నిర్వహిస్తుండగా.. ఇందులో వెయ్యి మంది పొరుగు సేవల వారు ఉన్నారు. అలాగే మరో 1739 మంది డీఎస్సీ ద్వారా ఎంపికైన వారు ఉన్నారు. అయితే వీరు ఎంపికయ్యాక నేరుగా విధుల్లో చేరలేదు. వివిధ కారణాల రిత్యా ఆలస్యంకావడంతో వారి సర్వీసు నాలుగేళ్లు నిండలేవు.
అలాగే మందిపు జాబితాలో కూడా వారి పేర్లు లేవు. దీన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర సర్కార్ 6603 పోస్టులను క్రమబద్ధీకరించిన జేపీఎస్‌లతో భర్తీ చేసింది. అలాగే మరో 3065 ఖాళీ పోస్టులు ఉన్నందువల్ల జేపీఎస్‌లుగా పనిచేసిన మిగిలిన వారిని రెగ్యలరైజ్ చేయడం ద్వారా నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. మరోవైపు నాలుగో గ్రేడ్ కార్యదర్శులుగా ఏ తేది నుంచి నియామితులయ్యారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై కొత్త స్కేలులో వేతనాల పంపిణీకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.