తెలంగాణలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు తొలకరి జల్లులు పడడంతో గ్రామదేవతలకు పూజలు నిర్వహిస్తున్నారు. మరికొందరు.. తమ తమ ఇష్టదైవాలకు పూజలు చేసి తమని తమ గ్రామాన్ని చల్లగా చూడమంటూ వేడుకుంటారు. ఈ క్రమంలోనే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఉత్తరవాహిని గోదావరి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు గంగపుత్రులు.
ఎండల వేడి నుంచి.. వేసవి తాపం నుంచి ఉపశమనం ఇస్తూ తొలకరి జల్లులు కురవడంతో పుడమి తల్లి పులకించింది. అన్నదాత హలం పట్టి పొలం దున్ని పంటలను పండించడానికి రెడీ అవున్నాడు. అయితే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు తొలకరి జల్లులు పడడంతో గ్రామదేవతలకు పూజలు నిర్వహిస్తున్నారు. మరికొందరు.. తమ తమ ఇష్టదైవాలకు పూజలు చేసి తమని తమ గ్రామాన్ని చల్లగా చూడమంటూ వేడుకుంటారు. ఈ క్రమంలోనే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఉత్తరవాహిని గోదావరి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు గంగపుత్రులు.
గోదావరి నదీ జలాలపై ఆధారపడి జీవిస్తున్న గంగపుత్రులు.. తొలకరి జల్లు పడడంతో జాతర నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి చల్ల ముంతలతో గంగపుత్రులకు ఆధారమైన గొల్లనతో ఊరేగింపు చేశారు. చల్ల ముంతలు ఎత్తుకొని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి తల్లి దీవెనలు కోసం మొక్కారు. ఏడాదంతా చల్లగా చూడాలని గోదావరి తల్లికి పూజలు చేశారు గపుత్రులు. గోదావరిలో కొత్త నీరు చేరి చేపలు అభివృద్ధి చెంది గంగపుత్రులకు జీవనాధారం కావాలని గోదావరి తల్లిని కోరుకున్నారు. గంగపుత్రుల జాతరతో గోదావరి పరివాహక ప్రాంతమంతా సందడిగా మారింది.