ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణను రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దేవరకద్రకు చేరుకుని తిమ్మాయిపల్లి తండాకు చెందిన మహిళలతో సమావేశం అవుతారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లపై ప్రచారం చేస్తారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కొల్లాపూర్ నియోజవర్గ కేంద్రంలో నిర్వహించే పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొని ప్రసంగిస్తారు. నవంబర్ 1, 2న రాహుల్‌గాంధీ మరోసారి బస్సుయాత్ర, రోడ్ షోలలో పాల్గొంటారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ తొలివిడత యాత్రకు మంచి స్పందన వచ్చిందని.. ఈ యాత్రను కూడా విజయవంతం అవుతుందని లెక్కలేసుకుంటున్నారు.
రెండో విడత ప్రచారం చేసేందుకు ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణను రానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్, దేవరకద్రలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. అలాగే నవంబర్ ఒకటి, రెండు తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుంది. నవంబర్ ఒకటిన కల్వకుర్తి, జడ్చర్ల షాద్‌నగర్ సభల్లో ఆయన పాల్గొంటారు. నవంబర్ రెండున మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ సభల్లో రాహుల్ మాట్లాడతారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకతో కలిసి గత నెల 18న ములుగు జిల్లా బహిరంగ సభలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రాహుల్ అక్టోబర్ 19, 20న ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాలో పర్యటించారు. లేటెస్ట్గా మహిళా ఓటర్లపై ఫోకస్ పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మంగళవారం ప్రియాంక గాంధీ పర్యటించబోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దేవరకద్రకు చేరుకుని తిమ్మాయిపల్లి తండాకు చెందిన మహిళలతో సమావేశం అవుతారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లపై ప్రచారం చేస్తారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కొల్లాపూర్ నియోజవర్గ కేంద్రంలో నిర్వహించే పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఇక నవంబర్ 1, 2న రాహుల్‌గాంధీ మరోసారి బస్సుయాత్ర, రోడ్ షోలలో పాల్గొంటారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ తొలివిడత యాత్రకు మంచి స్పందన వచ్చిందని.. ఈ యాత్రను కూడా విజయవంతం అవుతుందని లెక్కలేసుకుంటున్నారు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతోనూ రాష్ట్రంలో ప్రచారం చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు. సభలు, రోడ్ షోలకు రూట్ మ్యాప్ సిద్ధంచేస్తున్నారు. వచ్చేనెల 3 నుంచి నామినేషన్లు మొదలవుతాయి. నామినేషన్ల అనంతరం ప్రచారం స్పీడ్ మరింత పెంచుతామంటున్నారు.
కాంగ్రెస్ పార్టీకి TJS బేషరతు మద్దతు..
కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలంగాణ జనసమితి ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి TJS బేషరతు మద్దతు తెలిపింది. ఇక ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. మరో విడత ప్రచారం చేసేందుకు ప్రియాంక, రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తవడంతో ప్రచారం, ఇతర వ్యూహాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. సహకరించిన వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా TJS అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, కర్నాటక మంత్రి బోసురాజు, కలిశారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని కోరారు.
కేసీఆర్ సర్కారును గద్దె దింపేందుకు కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించినట్టు TJS అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. మరో వైపు రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం కొనసాగుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదని అన్నారు.