తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలు జిల్లాల్లో ముందుగా ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. చివరి నిమిషంలో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. వందల మంది ఒక్కసారిగా రావడంతో చాలా వరకూ పోలింగ్ స్టేషన్లు రద్దీగా మారిపోయాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలు జిల్లాల్లో ముందుగా ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. చివరి నిమిషంలో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. వందల మంది ఒక్కసారిగా రావడంతో చాలా వరకూ పోలింగ్ స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్న రాత్రి వరకు జరిగిన మొత్తం పోలింగ్ శాతం 70.60గా వెల్లడించారు ఎన్నికల సంఘం అధికారులు. అత్యధికంగా యాదాద్రిలో 90.03శాతం నమోదు కాగా.. హైద్రాబాద్‌లో అత్యల్పంగా 46.56 శాతం నమోదైంది. ఓటు వేసేందుకు సుముఖత చూపించలేదు హైదరాబాదీలు.
అచ్చంపేట, జనగామతోపాటూ ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో కూడిన చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. వీరిని పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం ఓటింగ్ 4 గంటలకే ముగించారు. పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లోని ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూములకు తరలించారు అధికారులు. ఇలాంటి పరిస్థితుల మధ్య పోలింగ్ ఎంత శాతం నమోదైందో జిల్లాల వారీగా ఇప్పుడు చూద్దాం.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం..
అదిలాబాద్ – 79.86
భద్రాద్రి – 78.65
హనుమకొండ – 66.38
హైద్రాబాద్ – 46.56
జగిత్యాల – 76.10
జనగాం – 85.74
భూపాలపల్లి – 81.20
గద్వాల్ – 81.16
కామరెడ్డి – 79.59
కరీంనగర్ – 74.61
ఖమ్మం – 83.28
ఆసిఫాబాద్ – 80.82
మహబూబాబాద్ – 83.70
మహబూబ్‌నగర్ – 77.72
మంచిర్యాల – 75.59
మెదక్ – 86.69
మేడ్చల్ – 56
ములుగు – 82.09
నగర్ కర్నూల్ – 79.46
నల్గొండ – 85.49
నారాయణపేట – 76.74
నిర్మల్ – 78.24
నిజామాబాద్ – 73.72
పెద్దపల్లి – 76.57
సిరిసిల్ల – 76.12
రంగారెడ్డి – 59.94
సంగారెడ్డి – 76.35
సిద్దిపేట – 79.84
సూర్యాపేట – 84.83
వికారాబాద్ – 76.47
వనపర్తి – 77.64
వరంగల్ – 78.06
యాదాద్రి – 90.03