తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఇవాళ ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. ఒక్కో అభ్యర్థి రెండు, మూడు నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీల తరపున వేసిన దరఖాస్తు తిరస్కరణకు గురైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ముందస్తుగా నామినేషన్ వేశారు. దీంతో ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి అనేది తేలిపోనుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఇవాళ ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. ఒక్కో అభ్యర్థి రెండు, మూడు నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీల తరపున వేసిన దరఖాస్తు తిరస్కరణకు గురైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ముందస్తుగా నామినేషన్ వేశారు. దీంతో ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి అనేది తేలిపోనుంది. ఇక ఈ నెల 15వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలకు 2,327 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు ఈసీ నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక బీఆర్ఎస్ 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 118 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఒక సీటును మిత్రపక్షమైన సీపీఐకి వదిలిపెట్టింది. బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేయగా, దాని మిత్రపక్షమైన జనసేన పార్టీకి 8 స్థానాలను వదిలిపెట్టింది.MIM తొమ్మిది స్థానాల్లో పోటీ చేయగా, మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తోంది.
ఇవాళ నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు అబ్జర్వర్లను నియమించింది ఈసీ. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించగా.. 39 మంది ఐపీఎస్ అధికారులు పోలీసు పరిశీలకులుగా బాధ్యతలు చేపట్టారు. మరో 60 మంది ఐఆర్ఎస్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 166 మంది అబ్జర్వర్లు వివిధజిల్లాలో నామినేషన్లు పరిశీలన చేపట్టనున్నారు.