తెలంగాణ దంగల్ క్లైమాక్స్‌కి వచ్చేసింది. ఇవాళ్టితో కలిపి ప్రచారానికి మిగిలింది ఇంకా నాలుగే నాలుగు రోజులు. అందుకే, క్యాంపెయినింగ్లో మరింత స్పీడ్ పెంచాయి పార్టీలు. వరుస సభలు, రోడ్‌షోలు, సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు మెయిన్ లీడర్స్. ఇవాళ ఒక్కరోజే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలంతా తెలంగాణపై దండెత్తబోతున్నారు.
తెలంగాణ దంగల్ క్లైమాక్స్‌కి వచ్చేసింది. ఇవాళ్టితో కలిపి ప్రచారానికి మిగిలింది ఇంకా నాలుగే నాలుగు రోజులు. అందుకే, క్యాంపెయినింగ్లో మరింత స్పీడ్ పెంచాయి పార్టీలు. వరుస సభలు, రోడ్‌షోలు, సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు మెయిన్ లీడర్స్. ఇవాళ ఒక్కరోజే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలంతా తెలంగాణపై దండెత్తబోతున్నారు. త్రిముఖ పోరులో హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్.. ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్ పక్కా వ్యూహాలతో ఈ నాలుగు రోజులు తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించనున్నాయి. అగ్రనేతల ఎంట్రీతో సమీకరణాలు మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మోదీ.. అమిత్ షా.. యోగి..
బీజేపీ నుంచి ప్రధాని మోదీ.. ఇవాళ కామారెడ్డి, తుక్కుగూడలో ఇవాళ ప్రచారం నిర్వహించనున్నారు. కొల్లాపూర్, మునుగోడు, పటాన్చెరు, ఖైరతాబాద్‌లో అమిత్‌షా ప్రచారం చేస్తారు. ఇక, హుజూర్నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్‌లో జేపీ నడ్డా సభలు ఉండగా.. సిర్పూర్, వేములవాడ, సనత్‌నగర్, గోషామహల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేయనున్నారు.
ఖర్గే.. రాహుల్, ప్రియాంక, డీకే..
కాంగ్రెస్ అగ్రనేతలు కూడా తెలంగాణను చుట్టేయబోతున్నారు. ఇవాళ ఒక్కరోజే బోధన్, ఆదిలాబాద్, వేములవాడలో ప్రచారం చేయనున్నారు రాహుల్‌గాంధీ. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిరలో ప్రియాంక ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక, హైదరాబాద్‌లో డీకే శివకుమార్… కల్వకుర్తిలో ఖర్గే, రేవంత్ సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు.
కేటీఆర్.. హరీష్..
ఈ చివరి నాలుగు రోజుల్లో కూడా ప్రచారాన్ని హోరెత్తించబోతోంది బీఆర్ఎస్. ఇవాళ కామారెడ్డి, జుక్కల్, మలక్‌పేట్, గోషామహల్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. యాదాద్రి జిల్లా చీకటిమామిడిలో హరీష్ కార్నర్ మీటింగ్, భువనగిరిలో రోడ్‌షో నిర్వహిస్తారు.
గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటివరకు 80 నియోజకవర్గాలను కవర్ చేశారు. రేపు ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో.. 27న షాద్‌నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డిలో ప్రచారం నిర్వహిస్తారు. చివరి రోజు, అంటే 28న వరంగల్ ఈస్ట్ అండ్ వెస్ట్‌తోపాటు సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో క్యాంపెయినింగ్ను ముగిస్తారు కేసీఆర్.