తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో కీలక అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్‌లు) బదిలీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటినుండి ఇప్పటికి మూడు రకాలుగా అధికారుల బదిలీలు జరిగాయి. ఆరోపణలున్న అధికారులను మూడు రౌండ్లలో ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది. తాజాగా మరి కొంతమంది అధికారులపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో కీలక అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్‌లు) బదిలీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటినుండి ఇప్పటికి మూడు రకాలుగా అధికారుల బదిలీలు జరిగాయి. ఆరోపణలున్న అధికారులను మూడు రౌండ్లలో ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది. తాజాగా మరి కొంతమంది అధికారులపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎన్నికల కమిషన్ బదిలీలపై పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ మొదటి రౌండ్లోనే హైదరాబాద్ టాప్ కాప్‌తో పాటు మొత్తం 13 మంది అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. కొన్ని జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఆ జిల్లాకు అధికారిగా వ్యవహరిస్తున్న ఎస్పీలతోపాటు కలెక్టర్లను బదిలీచేసింది. ఇక నెక్స్ట్ లిస్టులో తమ పేరు ఎక్కడుంటుందోనని పలువురు అధికారులు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం..
ఇలా, ఏదో ఒక రకంగా.. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మెడపై కత్తి వేలాడుతూనే ఉంది. తెలంగాణలో ఎన్నికల బదిలీల పేరుతో మూడో లిస్టు సైతం బయటికి వచ్చింది.. ఒకవైపు అభ్యర్థుల పేరుతో రాజకీయ పార్టీలు లిస్టు ప్రకటిస్తుంటే, ఎన్నికల కమిషన్ మాత్రం అధికారుల బదిలీల పేరుతో లిస్టు విడుదల చేస్తుండటం.. హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడుతో పాటు కరీంనగర్ కలెక్టర్ గోపిని బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల వేళ రాష్ట్రంలో మరిన్ని బదిలీలు జరుగుతాయని.. మరో లిస్ట్ రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బదిలీలపై పలువురు అధికారులు లోలోపల గుట్టుగా చర్చించుకుంటున్నారు. ఓ ప్రధాన పార్టీ నేతలు ఇస్తున్న ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని బదిలీలు చేస్తున్నారని చర్చించుకోవడం ఆయా డిపార్ట్మెంట్లలో కలకలం రేపుతోంది. ఆ పార్టీ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిందంటూ బదిలీకి గురైన అధికారి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అధికార వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది.
అయితే, ఎన్నికల షెడ్యూల్ నాటినుంచి పలువురు అధికారులపై ప్రతిపక్ష నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పలువురు ఐపీఎస్ లపై పదేపదే మీడియా ముఖంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నేతల ఫిర్యాదుల మేరకే బదిలీలు అంటూ పలువురు అధికారులు వాపోతున్నారని టాక్ వినిపిస్తోంది. కరీంనగర్లో అధికారుల బదిలీ వెనుక కూడా నేతల ఫిర్యాదులే కారణంగా తెలుస్తుంది.
కరీంనగర్లో కొద్దిరోజుల క్రితం జరిగిన రెండు గ్రూపుల మధ్య వివాదాన్ని కమ్యూనల్ గొడవగా మలిచారు. అయితే ఈ ఘటనలో అనేకమంది ఓ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బిజెపి నేతలు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కరీంనగర్ సీపీ, కరీంనగర్ కలెక్టర్ బదిలీకి గురయ్యారు.
ఇక తాజాగా టాస్క్ ఫోర్స్ డిసిపి రాధ కిషన్ బదిలీపైనా అలాంటి ప్రచారమే జరిగింది. పలుమార్లు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగంగానే రాధ కిషన్ పై ఆరోపణలు చేశారు. సర్వీస్ ముగిసిన పొడగింపు పేరుతో పదేపదే పోస్టింగ్ పొందుతున్న అధికారులపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు నేతలు ఫిర్యాదులు చేశారు.
మొదటి రౌండ్ బదిలీలు..
ఎలక్షన్ కమిషన్ బదిలీలు అక్టోబర్ 11 నుంచి మొదలయ్యాయి. 13 మంది పోలీస్ అధికారులతో పాటు నలుగురు కలెక్టర్లు ఒక ఐఏఎస్ తో పాటు ఇద్దరు అధికారులను ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తోపాటు వరంగల్ కమిషనర్ రంగనాథ్, నిజామాబాద్ సత్యనారాయణ, సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్, కామారెడ్డి ఎస్పి శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్, మహబూబ్ నగర్ ఎస్పీ నర్సింహ, నాగర్ కర్నూల్ ఎస్పీ మనోహర్, గద్వాల్ జోగులాంబ ఎస్పీ సృజన, మహబూబాబాద్ ఎస్పీ చంద్రమోహన్, నారాయణపేట ఎస్పి వెంకటేశ్వర్లు, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్, సూర్యాపేట ఎస్పి రాజేంద్రప్రసాద్, రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ అమోయ్‌కుమార్, యాదాద్రి భువనగిరి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ విష్ణు రెడ్డి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫారుకీలు ఉన్నారు. కమర్షియల్ టాక్స్ కమిషనర్ శ్రీదేవిని సైతం ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది.
సెకెండ్ రౌండ్ బదిలీలు..
అక్టోబర్ 20న జరిగిన బదిలీలలో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ తోపాటు ఐదుగురు డీసీపీలను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో రోహిత్ రాజు, రాచకొండ డీసీపీ బాలస్వామి, సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ డీసీసీ నికిత పంత్, ఏసీబీ జాయిన్ డైరెక్టర్ చేతన, ఐజిపి ట్రైనింగ్ తరుణ్ చూసిలను బదిలీ చేసింది.
మూడోవ రౌండ్ బదిలీలు..
తాజాగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుబ్బరాయుడుతోపాటు కలెక్టర్ బి గోపిని ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది.