రైతు బంధుపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హై ఓల్టేజ్ ఫైట్ నడుస్తోంది. రైతు బంధు నిధుల పంపిణీని నిలుపుదల చేస్తూ ఎన్నికల కమిషన్ సోమవారం ఉదయం ఆదేశాలివ్వడం తెలిసిందే. కాంగ్రెస్ కుట్రల వల్లే రైతుబంధును ఈసీ నిలిపివేసిందని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. అయినా డిసెంబరు 3 వరకే రైతు బంధు నిధులను రైతులకు ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుకోగలదని వ్యాఖ్యానించారు.రైతు బంధుపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హై ఓల్టేజ్ ఫైట్ నడుస్తోంది. రైతు బంధు నిధుల పంపిణీని నిలుపుదల చేస్తూ ఎన్నికల కమిషన్ సోమవారం ఉదయం ఆదేశాలివ్వడం తెలిసిందే. కాంగ్రెస్ కుట్రల వల్లే రైతుబంధును ఈసీ నిలిపివేసిందని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. రైతుల నోటి దగ్గరి ముద్దను కాంగ్రెస్ పార్టీ లాగిపారేసిందని అన్నారు. రైతుబంధు నిధుల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందనే విషయాన్ని తాను చెప్తే అందులో తప్పేముందని ప్రశ్నించారు. అయినా డిసెంబరు 3 వరకే రైతు బంధు నిధులను రైతులకు ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుకోగలదని వ్యాఖ్యానించారు. అయితే రైతు బంధు నిధులను కాంగ్రెస్ అడ్డుకుందన్న ఆరోపణలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. మంత్రి హరీష్ మాటల వల్లే రైతుబంధుకు బ్రేక్ పడిందంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం క్లైమాక్స్‌కి చేరింది. రేపు (మంగళవారం) సాయంత్రం 5 గం.లకు తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.