ఈరోజుల్లో రాజకీయాలు రక్త సంబంధీకులను కూడా విడదీస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఇలానే ఉన్నాయి. ఆందోల్ నియోజకవర్గంలో ఇదే జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు, యాక్టర్ బాబూ మోహన్ కొడుకు ఉదయ్ తండ్రిని కాదని పార్టీ మారారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ముందు నుంచి రాజకీయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు ఉదయ్.
ఈరోజుల్లో రాజకీయాలు రక్త సంబంధీకులను కూడా విడదీస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఇలానే ఉన్నాయి. ఆందోల్ నియోజకవర్గంలో ఇదే జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు, యాక్టర్ బాబూ మోహన్ కొడుకు ఉదయ్ తండ్రిని కాదని పార్టీ మారారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ముందు నుంచి రాజకీయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు ఉదయ్. పార్టీ మీటింగ్ మొదలు అన్ని సందర్బాల్లో సపోర్ట్ చేస్తూ వచ్చారు. కొంత కాలం నుంచి ఆందోల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ఉదయ్. తనకు టికెట్ ఇవ్వాలంటూ స్వయంగా, తండ్రి ద్వారా హైకమాండ్‌ను కోరారు. కానీ బీజేపీ హైకమాండ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఉదయ్‌ని కాదని బాబు మోహన్కే టికెట్ కేటాయించింది బీజేపీ హై కమాండ్. దీంతో ఉదయ్ తీవ్ర అసతృప్తికిగురయ్యారు. టికెట్ ఇవ్వని పార్టీలో ఎందుకు ఉండాలి అనుకున్నారో ఏమో.. తండ్రి ఉన్నారు అని కూడా చూడకుండా పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్లో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దీంతో ఆందోల్ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు బాబు మోహన్ బీజేపీ నుంచి ఆయన కొడుకు బీఆర్ఎస్ నుంచి ప్రచారం చేయబోతున్నారు. దీంతో క్యాడర్ కన్ఫ్యూజన్లో పడింది.