వరంగల్ ఉమ్మడి జిల్లాలో బిజెపికి ఊహించని షాప్ తగిలింది.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కమలం పార్టీకి బై బై చెప్పనున్నారు.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా పలువురు సీనియర్లు.. రేవూరి ప్రకాశ్ రెడ్డితో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి.. రెడ్డి సామజికవర్గం అంతా ఒక్కతాటి పైకి వచ్చి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో మట్టి కరిపించడమే..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా కొత్త కొత్త చేరికలు.. సీనియర్ నేతల పార్టీల మార్పులతో సరికొత్త సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి.. తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో బిజెపికి ఊహించని షాప్ తగిలింది.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కమలం పార్టీకి బై బై చెప్పనున్నారు.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం..
టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా పలువురు సీనియర్లు.. రేవూరి ప్రకాశ్ రెడ్డితో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి.. రెడ్డి సామజికవర్గం అంతా ఒక్కతాటి పైకి తెచ్చే లక్ష్యంగా వాళ్ళు చేస్తున్న వ్యూహాల్లో రేవూరి ప్రకాశ్ రెడ్డి ని కలిసి రావాలని కోరినట్లు సమాచారం.. నేపథ్యంలో ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం..
అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రేవూరి ప్రకాష్ రెడ్డి సుముకథ చూపడంతో ఆయన చేరిక దాదాపుగా ఖరారయిపోయింది..నేడో రేపో ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పు కోనున్నారు.. రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేట నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయడం కోసం గత కొద్దిరోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.. తాజాగా నర్సంపేట కాంగ్రెస్ అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి పేరును ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది..
రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడానికి వ్యూహరచన చేస్తున్నట్లుగా సమాచారం.. ఇప్పటికే రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల స్థానం కేటాయిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం… అయితే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా పరకాల నుండి పోటీకి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.. మెజారిటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని భావిస్తున్న రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నుండి తన గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నారు..
అందులో భాగంగానే కమిటీ సూచన మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల నుండి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.. ఇక ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడమే తరువాయి.. రేవూరి పరకాల నుండి పోటీచేస్తే ఇప్పటికే పరకాల పై ఆశలు పెట్టుకున్న కొండా మురళి, ఇనుగాల వెంకట్రామిరెడ్డి పరిస్థితి ఏంటి అనే చర్చ జరిగుతుంది…
మరోవైపు రేవూరి తో పాటు ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు..! అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఒక్కసారిగా ఆసక్తికర చర్చకు దారితీసాయి.. పలువురు సీనియర్ నాయకులు ఇటు బీఆర్ఎస్ అటు బిజెపి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.