తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సీట్ల కేటాయింపుల్లో అన్ని పార్టీలు తలా మునకలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజారిటి సీట్లు బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. వేములవాడ మాత్రం పెండింగ్ లో పెట్టింది. అయితే… మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు, మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ పోటీ పడుతున్నారు. ఈ టికెట్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సీట్ల కేటాయింపుల్లో అన్ని పార్టీలు తలా మునకలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజారిటి సీట్లు బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. వేములవాడ మాత్రం పెండింగ్ లో పెట్టింది. అయితే… మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు, మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ పోటీ పడుతున్నారు. ఈ టికెట్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. తనయుడికి టికెట్ ఇప్పించేందుకు ఏకంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు రంగంలోకి దిగారు. బీజేపీ అధిష్టానం మాత్రం సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తామని చెబుతుంది. రెండోవ జాబితాలో వేములవాడ పేరు ఉంటుందా.. లేదంటే… జాబితా ప్రకటిస్తారమే.. అన్న విషయంలో స్పష్టత రావడం లేదు..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వేములవాడ బీజేపీలో వర్గ పోరు రోజు రోజుకు ముదురుతుంది. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు, అదే విధంగా మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వికాస్ రావు ఇటీవలనే, కాషాయ కండువా కప్పుకున్నారు. తుల ఉమ.. ఈటెల రాజేందర్‌తో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. అయితే, వికాస్ రావు చేరక ముందు నుంచే ఉమకే టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉంది. ఇప్పుడు మాత్రం టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఏర్పడింది.
మొదటి జాబితాలోనే వేములవాడ టికెట్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాత్రం వికాస్‌కు టికెట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారట. ఈటెల మాత్రం తుల ఉమకు టికెట్ ఇప్పించుకునేందుకు పట్టుబడుతున్నారు. దీంతో తొలి జాబితాలో టికెట్ ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు. మొన్నటి వరకు ఎక్కడ కనబడని విద్యాసాగర్ రావు.. ఇప్పుడు తనయుడు కోసం రంగంలోకి .దిగారు. బీజేపీ సీనియర్ నేతలు సునీల్ బన్సల్‌తో పాటు, ప్రకాశ్ జవదేకర్‌ను కలుకున్నారు. వికాస్ రావుకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. రాజేందర్ మాత్రం తుల ఉమకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుందనే భరోసా ఇస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా వుంటే, నవంబర్ 1వ తేదీని రెండవ జాబితా విడుదల కానుంది. అప్పటి వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తుల ఉమ మాత్రం టికెట్ వచ్చినా, రాకున్నా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గడప గడపకు తుల ఉమ అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. తనకు అన్యాయం చేయవద్దని కోరుతున్నారు తుల ఉమ. మహిళకు అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఈ ఇద్దరి నేతల కారణంగా వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ సైలెంట్ అయింది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఇద్దరు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. బీజేపీ మాత్రం టికెట్ రాకపోవడంతో ప్రచారం లేకపోవడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. చూడాలి మరీ.. బీజేపీ అధిష్టానం ఎవరిని కనికరిస్తుందో..!