తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 28,057 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది ఎన్నికల సంఘం ఈ నేపథ్యంలో ‘ఫారం–12డీ’ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారులు అనుమతించారు.
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 28,057 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది ఎన్నికల సంఘం ఈ నేపథ్యంలో ‘ఫారం–12డీ’ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారులు అనుమతించారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అత్యవసరమైన సేవల ఓటర్లు వంటి గైర్హాజరైన ఓటర్ల నుండి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం 12డిలో మొత్తం 44,097 దరఖాస్తులు వచ్చాయి. అందులో 28,057 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. ఇక ఫారం 12డి పంపిణీ నవంబర్ 1న ప్రారంభం కాగా, దరఖాస్తులను సమర్పించేందుకు నవంబర్ 8 చివరి తేదీగా నిర్ణయించారు ఎన్నికల అధికారులు.
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 812 దరఖాస్తులకు గాను 757 పోస్టల్ బ్యాలెట్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన 610 దరఖాస్తుల్లో 339 మాత్రమే అంగీకరించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజవర్గం పరిధిలో 707 దరఖాస్తులు రాగా, వాటన్నిటికీ రిటర్నింగ్ అధికారులు అనుమతిచ్చారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో 706 దరఖాస్తులు రాగా వాటికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. అత్యల్పంగా మక్తల్ నియోజకవర్గ పరిధిలో 19 దరఖాస్తులురాగా, రిటర్నింగ్ అధికారులు అంగీకరించారు. నారాయణపేట్ నియోజకవర్గ పరిధి లో 28 దరఖాస్తులు రాగా, 28 దరఖాస్తులను, వికారాబాద్నియోజకవర్గ పరిధిలో 30 దరఖాస్తులకుగాను 26 పోస్ట ల్ బ్యాలెట్లను అనుమతించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో 31 దరఖాస్తులు రాగా, 31 పోస్టల్ బ్యాలెట్లకు ఒకే చెప్పారు అధికారులు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో 34 దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రిటర్నింగ్ అధికారులు. ఎన్నికల విధులతో సంబంధం లేని 13 రకాల అత్యవసర సేవల్లో నిమగ్నమై ఉండే ఓటర్లకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వేస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ఎలక్ట్రిసిటీ వింగ్, ఫ్యామిలీ వెల్ఫేర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన ఉద్యోగులు తపాలా బ్యాలెట్లకు అర్హులైన అత్యవసర సేవా విభాగంలో భాగంగా పరిగణించబడే ఉద్యోగులు, ఆహారం, పౌర సరఫరా, BSNL, EC ద్వారా అనుమతి పొందినమీడియా వ్యక్తులు, అగ్నిమాపక సేవల సిబ్బందికి ఈసారి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం.