తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరి కోన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు వేగవంతమైంది. అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఇవాళ మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరి కోన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు వేగవంతమైంది. అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఇవాళ మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోకి మరో ఇద్దరు సీనియర్ నేతలకు స్థానం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్లకు చోటు కల్పిస్తూ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ గా ఎంపీమురళీధరన్ ఉన్నారు. సభ్యులుగా గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని, బాబా సిద్ధికి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కి లకు అందులో స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో అభ్యర్ధుల ఎంపిక కోసం మరింత స్క్రీనింగ్ జరగనున్నట్లు అర్ధమవుతోంది. అందరి నిర్ణయాలతోనే అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు 1016 మంది కాంగ్రెస్ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నుంచి 300 మంది అభ్యర్థులతో జాబితా తయారు చేసినట్టు తెలిసింది. వీటిలో 119 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. స్క్రీనింగ్ కమిటీ ఆ జాబితా నుంచి అభ్యర్థులను వడపోసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఫైనల్ కాపీని ఇవ్వనుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేయనుంది.
అయితే, కోసం కష్టపడే అందరికీ ఏదో ఒక రకంగా న్యాయం జరిగేలా చూస్తామని, అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలకే పెద్దపీట వేస్తూ.. సామాజిక సమీకరణాలు కూడా జోడిస్తామని కాంగ్రెస్ అధిష్టానం నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ వడపోసిన అభ్యర్థులకు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తుది ఆమోదముద్ర వేయనుంది. అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలనే ప్రధానంగా పరిగణలోకి తీసుకోనున్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.