వ్యవసాయ అధికారులు తమ రికార్డులో చెక్ చేసి చూడగా “లోన్ సాంక్షన్డ్ ఆఫ్టర్ డెత్” అని మా రికార్డులో ఉందని వారు తెలిపారన్నారు. దీంతో దేవేందర్ రెడ్డి సిరిసిల్లలో పాత్రికేయుల సమావేశంలో తన గోడువిన్నవించుకున్నాడు. బ్యాంకు అధికారుల తో పాటు వ్యవసాయ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వేధిస్తున్నారని ప్రశ్నించారు.
సిరిసిల్లకు చెందిన నేవూరి దేవేందర్ రెడ్డి అనే రైతు స్థానిక కెడిసిసి బ్యాంకు లో సుమారు ఐదు సంవత్సరాల క్రితం 84 వేల పంట రుణం తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ బ్యాంకులో చెల్లిస్తున్నాడు. అయితే తాజాగా ఇటీవల ప్రభుత్వం పంట రుణమాఫీ చేసిన జాబితాలో అతని పేరు రాలేదు. దీనిపై తన రుణమాఫీ ఎందుకు చేయలేదని బ్యాంకు వారిని అడిగితే బ్రతికి ఉన్నట్లు సర్టిఫికెట్ తెమ్మన్నారని తెలిపాడు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుండి బ్రతికున్న సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళిన తరువాత వ్యవసాయ అధికారులను కలవాలని సూచించారని తెలిపాడు.
వ్యవసాయ అధికారులు తమ రికార్డులో చెక్ చేసి చూడగా “లోన్ సాంక్షన్డ్ ఆఫ్టర్ డెత్” అని మా రికార్డులో ఉందని వారు తెలిపారన్నారు. దీంతో దేవేందర్ రెడ్డి సిరిసిల్లలో పాత్రికేయుల సమావేశంలో తన గోడువిన్నవించుకున్నాడు. బ్యాంకు అధికారుల తో పాటు వ్యవసాయ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వేధిస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు తన రుణ మాఫీ చేయని యెడల న్యాయ పోరాటానికి ఐనా సిద్దమని తెలిపాడు.