ఆయన తలపండిన నేత.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ దిగ్గజం.. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఘనాపాటి. వయోభారంతో క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగాలని భావించిన ఆ నేత మనసు మార్చుకున్నారా? ఆ పెద్దాయన..
ఆయన తలపండిన నేత.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ దిగ్గజం.. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఘనాపాటి. వయోభారంతో క్రియాశీలక రాజకీయాల(Telangana Politics) నుంచి వైదొలగాలని భావించిన ఆ నేత మనసు మార్చుకున్నారా? ఆ పెద్దాయన పార్లమెంటు బరిలో నిలబడబోతున్నారా? ఆయన దీపం ఉండగానే ఇల్లును చక్క బెట్టుకుంటున్నారా? తనయులను రాజకీయ అరంగ్రేటం చేయిస్తున్నారా? ఇంతకీ ఆ నేత ఎవరు? తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాష్ర్ట రాజకీయాలు అప్పుడే వేడెక్కుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించగా, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ మాత్రం గెలుపు గుర్రాల కోసం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ రాజకీయ దిగ్గజం జానారెడ్డి మాత్రం వయోభారంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని తొలుత భావించారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ టికెట్ కోసం పెద్దాయన దరఖాస్తు కూడా చేసుకొలేదు. దీపం ఉండగానే ఇంటిని చక్క బెట్టుకోవాలనే నానుడిని పెద్దాయన పాటిస్తున్నారు. క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని భావించిన జానారెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని తనయులు కొనసాగించేలా ప్లాన్ చేశారు. తనకు కంచుకోటగా ఉన్న నాగార్జున సాగర్ నుంచి చిన్నకొడుకు జైవీర్ రెడ్డి, తనకు పట్టున్న మిర్యాలగూడ నియోజక వర్గం నుంచి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డిలను రాజకీయ అరంగ్రేటం చేయించాలని జానారెడ్డి భావించారు. ఇందులో భాగంగా నాగార్జుసాగర్ నుంచి జైవీర్రెడ్డి, మిర్యాలగూడ నుంచి రఘువీర్ రెడ్డిలు కాంగ్రెస్ టికెట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
నాగార్జన సాగర్ నుంచి..?
కంచుకోటగా ఉన్న నాగార్జునసాగర్ నియోజక వర్గం నుంచి జానారెడ్డి ఏడుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలలో అత్యధిక కాలం మంత్రిగా పని చేసిన ఘనత జానారెడ్డిది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి గెలిచిన జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.
అయితే నాగార్జునసాగర్ నుంచి 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య, 2020లో జరిగిన ఉప ఎన్నికలో నర్సింహయ్య తనయుడు నోముల భగత్ చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. సాగర్ ఉప ఎన్నికల నుంచి జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ లోనే మకాం వేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
మిర్యాలగూడ నుంచి రఘువీర్..!
మిర్యాలగూడ నియోజక వర్గంలో తనకున్న పట్టును కొనసాగించేందుకు పెద్దకొడుకు రఘువీర్ ను ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి మరో నేత బత్తుల లక్ష్మారెడ్డి టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికీ టికెట్లు ఇవ్వకపోతే, ఉదయ్ పూర్ డిక్లరేషన్ క్రైటీరియాతో ఇద్దరు కొడుకులకు టికెట్లు ఇప్పించుకునేందుకు జానారెడ్డి పార్టీ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తన వారసులకు టికెట్లు ఇవ్వాలంటూ పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇతర నేతలను కూడా జానారెడ్డి కోరుతున్నారు.
నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా..
కాంగ్రెస్ అధిష్టానం.. గెలుపు గుర్రాల కోసం టికెట్ల కసరత్తు చేస్తుండగానే, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతానని జానారెడ్డి ప్రకటించారు. లోక్ సభకు పోటీ చేసే విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర పార్టీ పెద్దలకు జానారెడ్డి వివరించారట. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఉన్న సఖ్యతతో ఇద్దరు కుమారులకు టికెట్లు సంపాదించేందుకు పెద్దాయన తన రాజకీయ అనుభవానికి పదును పెడుతున్నారట. తన ఇద్దరి కొడుకులకు అసెంబ్లీ టికెట్లు ఇస్తే గెలిపించి.. లోక్ సభకు తాను పోటీ చేస్తానని పార్టీ పెద్దల వద్ద జానారెడ్డి తెగేసి చెబుతున్నారట. పార్లమెంటుకు పోటీ చేస్తానని జానారెడ్డి చేసిన ప్రకటన పార్టీలోనూ క్యాడర్ లోనూచర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో తన రాజకీయ వారసత్వాన్ని తనయులతో కొనసాగించాలన్న జానా కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.