వరుస కేసులు, ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది తెలుగుదేశం పార్టీ. ఒకవైపు కోర్టుల్లో చుక్కెదురు, ఇంకోవైపు వెంటాడుతోన్న కేసులతో అయోమయంలో పడింది. ఇక, బాబు కేసులో ఆల్రెడీ రెండు పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో… సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న టెన్షన్…
వరుస కేసులు, ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది తెలుగుదేశం పార్టీ. ఒకవైపు కోర్టుల్లో చుక్కెదురు, ఇంకోవైపు వెంటాడుతోన్న కేసులతో అయోమయంలో పడింది. ఇక, బాబు కేసులో ఆల్రెడీ రెండు పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో… సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న టెన్షన్… తెలుగుదేశం నేతల్ని భయపెడుతోంది. మరి, ఇవాళ ఏం జరగబోతోంది?. కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఎలా ఉండబోతోంది?.
దెబ్బ మీద దెబ్బ, కేసుల మీద కేసులు, కోర్టుల్లో ఎదురుదెబ్బలు, ఇదీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటోన్న గడ్డు పరిస్థితులు. కాలం కలిసిరాకపోతే తాడే…పామై కరుస్తుందంటారు!. ఇప్పుడలాగే ఉంది బాబు అండ్ టీమ్ సిట్యువేషన్. ఎందుకంటే, స్కిల్ స్కామ్ కేసులో అన్నీ ఎదురుదెబ్బలే!. దేశంలోనే పేరుమోసిన టాప్ లాయర్‌ను రంగంలోకి దింపినా… ఒక్కటంటే ఒక్కటి కూడా కలిసిరావడం లేదు!. పిటిషన్ల మీద పిటిషన్లు వేసినా, హోరాహోరీ వాదనలు వినిపించినా ఊరట మాత్రం దొరకడమే లేదు!. రిమాండ్ రిజక్ట్ పిటిషన్, హౌస్ రిమాండ్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేయడంతో తీవ్ర నైరాశ్యంలో వెళ్లిపోయింది. అదే టైమ్‌లో బాబు అండ్ కోపై ముప్పేట దాడి చేస్తోంది వైసీపీ. నెక్ట్స్ టార్గెట్ వాళ్లేనంటూ హెచ్చరికలు పంపుతోంది!.
చంద్రబాబు ఓ స్కిల్డ్ క్రిమినల్ అన్నారు విజయసాయిరెడ్డి. ఎంత పెద్ద స్కామ్ చేసినా చాలా నైపుణ్యంతో చేస్తారని, కానీ స్కిల్ స్కామ్‌లో మాత్రం అడ్డంగా దొరికిపోయారన్నారు. బాబు అరెస్ట్ అన్యాయం, అక్రమం అంటోన్న లోకేష్… తన తండ్రి నీతిమంతుడని చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు విజయసాయి!. నెక్ట్స్ టార్గెట్ నారా లోకేషే అంటూ సంకేతాలిచ్చారు విజయసాయిరెడ్డి!. స్కిల్ స్కామ్‌లో లోకేష్ పాత్రపై దర్యాప్తు జరుగుతోందని, ఆధారాలు దొరికిన వెంటనే యాక్షన్ ఉంటుందని హెచ్చరికలు పంపారు.
ఆల్రెడీ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నారు!. నెక్ట్స్ టార్గెట్ లోకేషేనని ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారు!. స్కిల్ స్కామ్‌తోపాటు చంద్రబాబు మెడపై మరో రెండు కేసులు వేలాడుతున్నాయ్!. ఇక లోకేష్‌ను కూడా స్కిల్ స్కామ్ కేసు చుట్టుముట్టబోతోంది!. తెలుగుదేశం నెంబర్ వన్, నెంబర్ టూ.. మాత్రమే కాదు, మెయిన్ లీడర్స్‌ను కూడా కేసులు చుట్టుముట్టే అవకాశం క్లియర్‌గా కనిపిస్తోంది!. లైన్లో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు పేర్లు వినిపిస్తున్నాయ్!. దీనికి సంబంధించి మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. త్వరలోనే ఈఎస్ఐ స్కామ్ తెరపైకి వస్తుందని, మాజీ మంత్రి యనమల అవినీతి లెక్కలు కూడా బయటికి వస్తాయన్నారు. చంద్రబాబుతోపాటు యనమల రామకృష్ణుడు కూడా జైలు ఊచలు లెక్కపెట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయంటూ నెక్ట్స్ ఏం జరగబోతోందో సంకేతాలు ఇచ్చారు దాడిశెట్టి రాజా.
వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది తెలుగుదేశం. ఒకవైపు కోర్టుల్లో చుక్కెదురు, ఇంకోవైపు వెంటాడుతోన్న కేసులతో గందరగోళంలో పడింది. ఇక, బాబు కేసులో ఆల్రెడీ రెండు పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో… సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న టెన్షన్… తెలుగుదేశం నేతల్ని భయపెడుతోంది. మరి, ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి!