పల్నాడు జిల్లా, అక్టోబర్ 3 (ఆంధ్రపత్రిక): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చడాన్ని నిరసిస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మాజీ మంత్రివర్యులు తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు, చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, రిలే నిరాహార దీక్షా 2వ రోజు చేపట్టడం జరిగింది. శారద హైస్కూల్ మాజీ చైర్మన్ మద్దుమాల రవి అధ్యక్షత వహించడం జరిగింది. 2వ రోజు నిరాహార దీక్షలో రైతు నాయకులు మద్దూరి వీరారెడ్డి, అంబటి సోంబాబు, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, కోడె హనుమంతరావు, నక్కా పోతురాజు, తోట రాము, మాలెంపాటి వెంకటరమణ, గోరంట్ల సింగరకొండయ్య, గుంటు కోటేశ్వరరావు, బొడ్డు సుశీల, నేలకుదురు మల్లేశ్వరి, ఉప్పలపాటి సీతారామయ్య, షేక్ హసన్ అహ్మమద్, పరుచూరి మురళి, నందిగం యోహాన్, కుంకరాలపాటి వీరాంజనేయులు, నందిగం శాంసన్, మద్దాలి రాధాకృష్ణమూర్తి, జొన్నలగడ్డ రత్తయ్య, నందిగం బుర్రయ్య, నందిగం వెంకటస్వామి, నందిగం వీరయ్య, కాకాని పోతురాజు, కుంభా వెంకటేశ్వర్లు, నందిగం బాబు, కుంభా శ్రీను, కొమ్మనబోయిన రామారావు కు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు సంఘీభావం తెలియజేశారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడితే ఆ పేరు తొలగించడానికి ఏమి నైతిక హక్కు ఉందని నిలదీశారు. వైసిపి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసుకున్న మెడికల్ కాలేజీలకు వైయస్సార్ పేరు పెట్టుకోవచ్చు కదా అని హితవు పలికారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అనుచిత నిర్ణయాలు తీసుకుంటే టిడిపి ప్రజా పోరాటం ద్వారా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అనంతరం, సాయంత్రం ఐదు గంటలకు దీక్షలో కూర్చున్న వారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముప్పాల హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, చిలకలూరిపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండా వీరయ్య, ఆరో వార్డు మాజీ కౌన్సిలర్ ఏలూరి తిరుపతయ్య, ఆరో వార్డు అధ్యక్షులు అరె మల్లికార్జున రావు దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!